అన్నమయ్య ఆధ్యాత్మికత యే , ఆతని విష్ణు భక్తికి కారణం. భక్తి అంటే అకుంఠిత విశ్వాసము. భక్తి , ఒక పవిత్ర మనో భావము. భావములన్నింటికీ మూలం” మనస్సు ”. మనస్సు ఎంత శుద్ధమో, భావము అంత శుద్ధము. నిర్మలమైన భక్తి భావమే, దైవానుగ్రహానికి కావలసిన సాధనం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్నికష్టాలు వఛ్చినా, అన్నిటినుండి కాపాడేందుకు దేవుడున్నాడనే భావమే “దైవ భక్తి “. అదియే నిజమైన ఆధ్యాత్మికత. ఎంత భక్తో, అంత ఫలము. ఈ విషయం గూర్చి, అన్నమయ్య చాలాసంకీర్తనలలో
ప్రస్తుతిన్చాడు. .
“ భక్తి కొలది వాడే పరమాత్ముఁడు
భుక్తి ముక్తి తానే యిచ్చు, భువి పరమాత్ముడు “ ( 410, సంపుటం).
ఈ భువిలో, భుక్తి , మోక్షము , రెండు ఆపరమాత్ముడే అంటే ఆ దైవమే యిస్తాడు.
ఎవరి భక్తి కొద్దీ వారికి ఫలం. భక్తి భావము పెంచుకోవాలి అని గదా అర్ధం ? ఎలా? కొన్ని రకాల సాధనలతో , దైవ భక్తి పెంచుకొని, ఆత్మ శుద్ధి చేసుకొని వచ్చు. అవి , పూజనము , ధ్యానము , జపము, తపము, గానము, దానము , హరిదాస సేవనము, సంకీర్తనము , మొదలైనవి.
పైన చెప్పిన మార్గములలో, ఏదైనా ఒక మార్గం , మనస్సును పవిత్రం చేసి, ఆ దైవము పై నిశ్చల భక్తి ని
కల్గించగలదు. భక్తితో ,
“ కొలిచిన వారల కొంగు పైడితడు
బలిమి తారక మంత్ర మీతడు. “
భక్తి యొక్క శక్తి ఎంతంటే, వేంకటేశుడు భక్తుల కొంగు బంగారం ఔతాడట. దేవుడు, తన భక్తుల వెంటే ఉంటాడు.” కొంగు “ పట్టుకొని, భక్తుడితోనే తిరుగుతాడట.
భక్తి భావమే, సులభ మార్గమ్ , మోక్ష సాధనకు......... అంటాడు.
అన్నమయ్య మాట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి