అన్నమయ్య , “ జీవాతుమై ఉండు చిలుకా, నీ
వావలి పరమాత్ముడై ఉండు చిలుకా “. (. సంకీర్తన 50, సంపుటం 1) అన్నాడు.
దేహములోపల ప్రకృతితో బంధింపబడిన పరమాత్మయే , “జీవాత్మ”.
“పరము దేవుడును, అపరము జీవుడు
తిరమైన ప్రకృతియే దేహము “. ( 396పాట , సంపుటం 1)kk
“ జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ
జ్ఞాన గమ్యమే సాధించు మనస్సు. “
దేహాత్మకు, పరమాత్మకు గల ఒకే సమాన గుణమేమిటంటే, “ మనస్సు “..
దేహంలోని మనస్సు పూర్తిగా శుభ్రమైనప్పుడే, బయటున్న పరమాత్మ “మనస్సు “తో, అనుసంధానము కాగలదు. జ్ఞానమొక్కటే , మనలోని మనస్సును శుభ్రపరచే “డిటర్జెంట్ “.
ఇదే విషయం , భగవద్ గీతలో , క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగంలో , క్రింది శ్లోకంలో చెప్పబడినది.
“ జ్యోతిషామ్ అపి తత్ జ్యోతిహి , తమసః పరం ఉచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం , హృది సర్వస్య విష్ఠితం “
దేహములోని జీవి, లేక జీవాత్ముడు, మనస్సును సాధనంగా ఉపయోగించుకొని , ఆ పరమాత్మను గూర్చి
తెలిసికొన గలరు. అశాశ్వతమైనది జీవాత్మ, శాశ్వత మైనది పరమాత్మ. ఒకటి క్షరము, మరొకటి అక్షరము..
జీవుడు ఎన్నో జన్మలలో , ఎన్నో శరీరాలను ధరించి, రకరకాల కార్యాలు చేసి, కాలం గడుపును.
ప్రకృతి ప్రభావం వలన జీవాత్మ , ఎన్నెన్నో పనులు చేసి, పాప పుణ్యాలను గదించడం జరుగుతుంది.
పాప పుణ్యాలు, కేవలం జీవాత్మకు వర్తిస్తాయి. పరమాత్మ సర్వ పావనుడు. సర్వ పరిపూర్ణుడు.
“ఎవ్వరెవ్వరివాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమొవ్నో యీ జీవుడు. ( 97వ పాట , సంపుటం 1)“
అనే సంకీర్తనలో, అన్నమయ్య ఇలాగ చెప్పారు. ఒక జన్మలో కొడుకుగ , ఇంకొక జన్మలో తోబుట్టుగ , ఇలా రకరకాల చుట్టరికాలతో, ఎక్కడెక్కడో పుట్టి , ఎన్నెన్నో శరీరాలు మోసి, సుఖ దుఃఖాలతో , తిరుగుతూ ఉంటాడు జీవుడు. అంటే జీవాత్మ.
ఎప్పుడు ఈ “ పునర్జన్మ చక్రభ్రమణం” నుండి బయటపడతాడో, ఎవ్వరికి తెలియదు.
“దేవుడు కారణము తెలిసినవారికెల్లా , జీవుడు కారణము చిల్లర మనుజులకు
దేవుడు వేరే కాడు , దిక్కు శ్రీ వేంకటేశుడే .... (471, సంపుటం) “
దేవుడైన శ్రీ వెంకటేశుడే కారణం, ఒక మనిషి పుట్టుగుకు.
దేవుడు విశ్వాత్ముడు, జీవుడు దేహాత్ముడు. .
“. “హిందూమతము “పునర్జన్మ సిద్ధాంతం “ మీద నిలబడిన “ధర్మము ”.
హిందూమతము “జీవాత్మ పరమాత్మల అనుబంధమౌ “ కర్మ బద్ధ సిద్ధాంతము. “. “.
అన్నమయ్యమాట

దేహములోని ఆత్మ, దేహము వెలుపల పరమాత్మ. . . ప్రకృతి లోని, త్రిగుణాలు , పంచభూతములు, మనస్సుతో కూడి, దేహాత్మ యగును. దేహములోని జీవాత్మనే, దేహాత్మ అని కూడా పిలిచాడు, అన్నమయ్య.
“పరము దేవుడును, అపరము జీవుడు
తిరమైన ప్రకృతియే దేహము “. ( 396పాట , సంపుటం 1)kk
“ జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ
జ్ఞాన గమ్యమే సాధించు మనస్సు. “
దేహాత్మకు, పరమాత్మకు గల ఒకే సమాన గుణమేమిటంటే, “ మనస్సు “..
దేహంలోని మనస్సు పూర్తిగా శుభ్రమైనప్పుడే, బయటున్న పరమాత్మ “మనస్సు “తో, అనుసంధానము కాగలదు. జ్ఞానమొక్కటే , మనలోని మనస్సును శుభ్రపరచే “డిటర్జెంట్ “.
ఇదే విషయం , భగవద్ గీతలో , క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగంలో , క్రింది శ్లోకంలో చెప్పబడినది.
“ జ్యోతిషామ్ అపి తత్ జ్యోతిహి , తమసః పరం ఉచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం , హృది సర్వస్య విష్ఠితం “
దేహములోని జీవి, లేక జీవాత్ముడు, మనస్సును సాధనంగా ఉపయోగించుకొని , ఆ పరమాత్మను గూర్చి
తెలిసికొన గలరు. అశాశ్వతమైనది జీవాత్మ, శాశ్వత మైనది పరమాత్మ. ఒకటి క్షరము, మరొకటి అక్షరము..
జీవుడు ఎన్నో జన్మలలో , ఎన్నో శరీరాలను ధరించి, రకరకాల కార్యాలు చేసి, కాలం గడుపును.
ప్రకృతి ప్రభావం వలన జీవాత్మ , ఎన్నెన్నో పనులు చేసి, పాప పుణ్యాలను గదించడం జరుగుతుంది.
పాప పుణ్యాలు, కేవలం జీవాత్మకు వర్తిస్తాయి. పరమాత్మ సర్వ పావనుడు. సర్వ పరిపూర్ణుడు.
“ఎవ్వరెవ్వరివాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమొవ్నో యీ జీవుడు. ( 97వ పాట , సంపుటం 1)“
అనే సంకీర్తనలో, అన్నమయ్య ఇలాగ చెప్పారు. ఒక జన్మలో కొడుకుగ , ఇంకొక జన్మలో తోబుట్టుగ , ఇలా రకరకాల చుట్టరికాలతో, ఎక్కడెక్కడో పుట్టి , ఎన్నెన్నో శరీరాలు మోసి, సుఖ దుఃఖాలతో , తిరుగుతూ ఉంటాడు జీవుడు. అంటే జీవాత్మ.
ఎప్పుడు ఈ “ పునర్జన్మ చక్రభ్రమణం” నుండి బయటపడతాడో, ఎవ్వరికి తెలియదు.
“దేవుడు కారణము తెలిసినవారికెల్లా , జీవుడు కారణము చిల్లర మనుజులకు
దేవుడు వేరే కాడు , దిక్కు శ్రీ వేంకటేశుడే .... (471, సంపుటం) “
దేవుడైన శ్రీ వెంకటేశుడే కారణం, ఒక మనిషి పుట్టుగుకు.
దేవుడు విశ్వాత్ముడు, జీవుడు దేహాత్ముడు. .
“. “హిందూమతము “పునర్జన్మ సిద్ధాంతం “ మీద నిలబడిన “ధర్మము ”.
హిందూమతము “జీవాత్మ పరమాత్మల అనుబంధమౌ “ కర్మ బద్ధ సిద్ధాంతము. “. “.
అన్నమయ్యమాట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి