“ భక్తి నీపై అదొకటే పరమసుఖము.
యుక్తి చూచిన నిజంబొక్కటి లేదు “
ఈ ప్రపంచంలో, ఒక్క దైవ భక్తే అమిత సుఖాన్ని ఇస్తుంది. తక్కినవేవైనా అంత హాయిని ఈయవు. అన్ని
ప్రాపంచిక విషయాలు, చివరగా దుఃఖాన్నే కలిగిస్తాయి. భక్తి తప్పించి అన్నీ విషయాలు విషాలే .
అన్నీ అసత్యాలే. ......... అంటాడు అన్నమయ్య, ఈ సంకీర్తనలో. ( 3, సంకీర్తన 322 )
“ ధనమెంత గలిగినా దట్టమౌ లోభంబు, మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము, ఎనయగా పరమపదము యించుకయు లేదు. “
సంపద ఎక్కువైయ్యేకొద్దీ పిసినాసి తనము, అందమెక్కువగా ఉండేకొద్దీ మోహభావము, ఎక్కువైన జ్ఞానంతో కళ్ళు కప్పే మదము, వస్తాయి. అంతేగానీ, ఏ రకంగానూ మంచి చేయదు. ఒక్క దైవ భక్తే ,
పెరిగే కొద్దీ ఆనందాన్నీ , మోక్షమార్గాన్నీ చూపేది. ఏదీ లేదని చింతిచనక్కర్లేదు. దైవభక్తి ఉంటే చాలు.
తక్కినవి అన్నీ ఇచ్చెంత ఆనందాన్ని ఇస్తుంది. అసత్యమైన, అశాశ్వతమైన, దుఃఖకారణమైన ప్రాపంచిక విషయాలకు, ఎంత విలువ ఇవ్వాలో తెలిసి జీవించడమే, జ్ఞాని లక్షణము, అంటారన్నమయ్య.
“ సిరులెన్ని కలిగినను చింతలే పెరుగు,
ఇరవైనా శ్రీ వెంకటేశా నిను కొలువగా , పెరిగే నానందము బెళుకులిక లేవు “
అధికమైన ధనం వల్ల అన్నీ ఇబ్బందులే, అన్నీ చింతలే. అదే, అధికమైన భక్తి తో వెంకటేశుని పూజించితే, ఆనందమే ఆనందం. పైగా వేంకటేశుని కటాక్షము. తోడు. అండ. ప్రేమ. ఆత్మ ధైర్యం.
భక్తి తప్పించి, యింక ఎక్కువగా ఎమున్నా చిరాకులే, చింతలే.
అందుకనీ, దైవ భక్తి మహిమ తెలిసి, జాగరూకులై, ప్రపంచ చింతలనుండి, సావధానంగా ఉండమని,
అన్నమయ్య మనలను హెచ్చరిస్తున్నారు.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి