అన్నమయ్య తన సంకీర్తనలతో, ఎన్నోమార్లు, తన మనస్సును ఉద్దేశించి చాలా వేదాంతం చెప్తాడు.
మనస్సుకు మరో పేరు చిత్తము. మనస్సు “ అంటే???? ఈ మనస్సు, రూపం ఏంటి ?
తనువులోపల, పరమాత్ముని, కనిపించని ఒక విభిన్నరూపం. మనస్సు.
ఎలాగ, ఐదు జ్ఞానేంద్రియాలు , అనుభవానికి మాత్రమే తెలుస్తున్నాయో, అల్లాగే మనస్సు కూడా స్వానుభవవేద్యం. మనస్సు “ఆరవ ఇంద్రియం”. “ మనః సష్టానీన్ద్రియాని ప్రక్రుతీస్తాని కర్షతి “ అని భగవద్ గీత లో చెప్పబడినదే , అన్నమయ్య పాటలో చెప్తున్నారు.
“ చిత్తమెప్పుడు సత్యాన్ని చెప్తుంది.
విశ్వఅంతరాళాలలో వ్యాపించిఉన్న, పరంజ్యోతి తో కూడిన మనస్సు యే , విశ్వాత్ముడు , పరమాత్ముడు, ప్రకాశాత్ముడు... అందుకే, దైవము సర్వము యెరుగును. “ సర్వ సాక్షి “.
పరంజ్యోతి లోని మనస్సు యే పరమాత్ముడు, సర్వాత్ముడు, అంతరాత్ముడు అని, వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాము. దేహము లోపల, దేహము వెలుపల, కండ్లకు కనిపించని, అనుభవానికి మాత్రమే అందే , అద్భుత అంతరాత్మయే, చిత్తము. హాఁ , చిత్తము, మన దేహములో నిలిచియున్న దైవము.
అన్ని రకాల భావాలూ , మనస్సునుండే జనిస్తాయి.
ఈ “ చిత్తము “ స్ధానము “ హృదయము “ నకు చేరువగా నుండు .. ఈవిషయం గూర్చి అన్నమయ్య క్రింది పాటలలో, ఇలా ముచ్చట గా చెప్పారు.
“ హృదయము లోపల దేవుడుండగా , ఎరుగక భ్రమయించుదు “. ( 3, సంకీర్తన 85 ).
“ చిత్తము లోపల నున్న “ చింతామణి “ యీ హరి “. (3 వ సంపుటం, 196సంకీర్తన ).
చింతామణి అంటే, కాంతులువేదజల్లే మాణిక్యం అని అర్ధం. చింతలు అంటే ఆలోచనలు . ఆలోచనలు “మనస్సు నుండి పుడతాయి. “చింతామణి “అంటే, ఆలోచనలనే కాంతులు వెదజల్లే మాణిక్యము వంటి మనస్సు యగు ఆ దైవము అని అన్నమయ్య అర్ధము.
“ ఎదలో నుండుదువని ఇన్ని వేదాలు చెప్పగా “ (. 3, సంకీర్తన 210 )
హృదయంలోనే దేవుడున్నాడని, వేదాలలో, భగవద్ గీతలోనూ చెప్పబడిఉంది.
“సర్వస్స్యచాహం హృది సన్నివిష్ఠహ ” అని గీత లో పురోషత్తమప్రాప్తి యోగంలో , చెప్పి ఉన్నది.
అందరిలో, అన్ని ప్రాణులలోను, దైవము “ మనస్సు “ గ, భావోద్భవకరుడుగ నెలవై వున్నాడని అర్ధము.
వేదాలు, పలు పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత , ఉపనిషత్తులు , ఇంకాఎన్నోధర్మ శాస్త్రాలు చదివి ,
అవపోసనపట్టిన, అన్నమయ్య పాట మాట కూడా అదే చెప్తోంది. ..
“ మనస్సే “. దైవం. హృదయంలో అది నిలయం అని.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి