పరమాత్ముడు సర్వాంతర్యామి. మన దేహము లోన, దేహము వెలుపల , ఎక్కడ చూచినా అక్కడ నెలవైయున్నాడు. మన దేహములో మనస్సు రూపంలో, హృదయం లో నెలవై వున్నాడు. అంతే కాదు,
“ చైతన్య రూపంలో “ నిలిచి, ఎన్నో పనులు చేయిస్తున్నాడు, “ జ్ఞానమై “ మన బుద్ధిని సంఛాలన చేయిస్తున్నాడు, అని, అన్నమయ్య కొన్ని సంకీర్తనలతో చక్కగా వివరించారు.మనలోన “ అంతరాత్మ యై ” ( మనస్సు ) , బుద్ధి జ్ఞాన చైతన్యము ల సమ్మేళనముతో , కర్మ కార్యములను మనతో చేయిస్తున్నాడట. ఈ ఈ రూపాలలో వున్నాడు , మన లోపల వెలుపల , అంటూ , క్రింది సంకీర్తనములలో ఎంతో బాగా చెప్పారు , అన్నమయ్య.
“సతతము జీవులకు చైతన్య సూత్రము
అతిశయ భక్తుల జ్ఞానామృతము “
“ఈ రూపమైయున్నాడు ఈతడే పరబ్రహ్మము
అదే పంచ భూతాలుండే అశ్వద్ధము “. (3, సంకీర్తన 244)
“ నారాయణుడే సర్వనాయకుడు
చైతన్య మీతనిది, సృష్టి యీతని ఘటన
ఆత్తుమ, శ్రీ వేంకటేశుడు అంతర్యామి “. ( 3, సంకీర్తనం 264 ).
“ “చిత్తములో విజ్ఞానము శ్రీ వెంకటేశా నీవే “
మనస్సులోని జ్ఞానవిజ్ఞానములు వేంకటేశ్వరుని మరోరూపములు, అని అన్నమయ్య భావము.
ఏ సర్వాంతర్యామి సృష్టి అంతయు వ్యాపించియున్నాడో, ఏ విశ్వాత్మ సృష్టి కారకుడో, ఆతడే మొత్తం ప్రాణులలో అంతరాత్మయి, మనస్సు లాగ ,” చైతన్యము ”లాగ , బుద్ధి జ్ఞానము లతో కూడి , అనేకమైన పనులు చేయిస్తున్నాడు. దైవము కనిపించని యట్ఠే ,” చైతన్యము” కూడా కనిపించదు
అని అన్నమయ్య వాక్కు. భగవద్ గీతలోనూ ఇదే విషయమిలాగ చెప్పబడింది.
“ సర్వస్యాచాహం హృది సన్నివిష్టాహ , మత్తహ స్మృతిర్ జ్ఞాన మాపోహనమ్ “
ఎప్పుడూ హృదయందగ్గరగా ఉంటూ, నేను బుద్ధి ఙ్ఞానం మరుపు రూపాలలో వుంటాను, చైతన్యమై ..
అన్నమయ్య మాట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి