అన్నింటిలో నున్న ఆ పరమాత్ముడు అగుపడడేమి???? ఇది అనాదిగా , అందరిని వేదిస్తున్న ప్రశ్న.
అలాగే మనస్సు , బుద్ధి, జ్ఞానం, చైతన్యం, లాంటి అనుభవానికి మాత్రమే అందే విషయాలు , కంటికి
ఏం కనిపించవు. .???? దైవీక మైన ఏ విషయమైనా కంటికి కానాననిదే. “వుంటుంది. ”అంతే.
దానికి కారణం ????? “మాయ “. అన్నమయ్య ఈ మాయను గూర్చి, మాయ అంటే ఏమిటో, చాలా పాటలలో, చెప్పారు. అన్నమయ్యకు మాయ అంటే తెలుసు, మాయలో దాగిన దైవమ్మూ తెలుసు.
“ దేవా నీ మాయా తిమిర మెట్టిదో , భారము జూచి గొబ్బున కావవే “ ( 1, సంకీర్తన 382)
“మాయ “ అనే చీకటి , మన అందరినీ ఆవహించివున్నది. ఈ మాయ ఎలాగుంటుంది?
“. పొలసి “ మశ కము “ నందు పోడమేటి జీవుని “
నీవెంత నేటెంత నీ మాయలివి భువి
(4, 363 సంకీర్తనం)
“ మసకము “ అంటే, ఒక తిత్తి లేక ఒక సంచీ లాంటిది. సత్వ, రజస్తమో గుణాలు మూడింటితో, తయారైన , ఈ మాయ అన్నీ జీవులను కప్పిఉంటుంది. దీనినే “ మోహమాయ “ అని కూడా అంటారు .
పంచభూత వికారాలు మోహమాయ వల్ల కలిగినవే.
మాయ వల్లే మనకీ సంసారబంధాలు. సంసార బంధాలవల్ల సుఖదుఃఖాలు. దీనినే కోరికల పై మొహం
అంటాము. మాయని అధిగమించడమే, వైరాగ్యం. వైరాగ్యమే బంధవిముక్తికి మార్గం. అంటారు అన్నమయ్య ఈక్రింది సంకీర్తనలలో .........
“ మాయకిదె సహజము , మాయను గెలువరాదు.
మాయానాధు గొలిచితే మన్నించునాతడే “
మాయను కల్పించిన ఆ దైవాన్నీ కొలుచుటే , దాన్ని గెలిచే మార్గము, అని అర్ధము.
ఈ “ మాయ “ సృష్టి జరిగిననాటినుండీ లోకాలను, జీవులను ఆవరించియున్నది.
మాయయే “ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే “ ఆరు గుణ శత్రువులకు మూలం.
ఈ ఆరుగుణాలు మనిషి జీవితాన్ని ఆడిస్తాయి. అందుకని, మొహం పెంచే , ఈ మాయ నుండి , విముక్తి పొందమని , ఆ వేంకటేశుని స్మరించడమే దానికి సాధనమని, అన్నమయ్య సూటిగా చెప్పారు.
“అనాది జగములు అనాది దేవుడు వినోదములుగాని విసుగదు మాయా
పుట్టేటి జీవులు, పోయిన జీవులు, వొట్టిన జీవులు వున్నారు. “
ఏ “పరంజ్యోతి “ విశ్వాఅంతరాళా లలో వెలుగు నింపుతోందో , దాన్ని కానరాకుండా కప్పివుంచుతోంది “ “మాయ “. ఆఁ మాయ అనే పొర తొలగితే , దైవము సాక్షాత్కరించడమే తరువాయ్.
“త్రిభిర్గుణమయై ర్భావైరభి స్సర్వమిదంజగత్ మోహితం నాభిజానాతి మామేభ్యహ్ పరమవ్యయం “ గీతలో ని ,. జ్ఞాన విజ్ఞానయోగంలో , చెప్పబడినది. అదే అన్నమయ్య పాట కూడా చేప్తోంది .
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి