3, జులై 2018, మంగళవారం

యోగి ఎవ్వరు ??.??

   యోగి ఎవ్వరు?  అసలైన  యోగి  ఎవ్వరు?  నిజమైన యోగికి ఉండే  లక్షణాలేమిటి???
యోగి అవ్వడానికి ఏ ఏ అర్హతలుండాలి?    యోగి కాడానికి , యే  మార్గం  ఉత్తమం? అన్నీ  పాయింట్లు ఒకే
సంకీర్తనలో  విశదీకరించారు అన్నమయ్య,  ఏంత్తో  ముద్దుగా.

              “ వాసి , వంతు  విడచినవాడే  యోగి, ఈ  ఆశలెల్ల విడచిన. అతడే యోగి
నాది ఇది,  నావంతు ఇది, అనే  ఆశాపాశాలు వదిలేసినవాడు ,  అసలైన “ యోగి “.

                “ గద్దించిపారెడు  తురగము వంటి  మనసు , వద్దని మరలించేవాడే  యోగి
                      వద్దని కొండలవంటి  ఉన్నత దేహగుణాలు , దిద్ది మట్టుపెట్టే వాడే “ ధీరుడైన యోగి

పరుగెత్తే  గుర్రంలాంటి మనస్సుకు  , పగ్గంవేసి ,  తన స్వాధీనంలోకి  తీసుకోగలిగినవాడే  “ యోగి “.    


 రజస్తమో గుణాల సంకెళ్లనుండి  శరీరాన్ని  శాసించి,  సత్వ గుణం వైపు మరలించే   వాడే  నిజమైన.
“ ధైర్యవంతుడైన యోగి “.
వైరాగ్యామంటే ఏమిటి?
                         “ ముంచుకొన్న ఇంద్రియపు మోహజలనిధిలోన , వంచన  మునగనట్టివాడే “  యోగి
                     పొంచి పుణ్యపాపములు  పొట్టువంటి కర్మములు , దంచి  పారజల్లువాడే తత్వమైనయోగి” “

పంచేంద్రియాలు ( చర్మం, చెవి, నాలుక, ముక్కు, కళ్ళు)  మనలో,   ప్రాపంచిక  విషయాలపై  మొహాన్ని        పుట్టిస్తాయి.  అలాంటి  మోహసముద్రములో  మునిగిపోకుండా, యే వంచనకూ  లోబడని వాడే  “ యోగి.                ”.
పొట్టు  లాంటి పాపపుణ్యములను,  కర్మబంధములను , దంచేసి,  ఆ పొట్టును  ఊదిపారేసే  వాడే,   యోగి      


పర తత్వ యోగి “ , పరతత్వం తెలిసిన యోగి.

                             “ వెగటు  కామాధుల  వెళ్లగొట్టి  శాంతుడై , వగలుడిగినయట్టి వాడే   “యోగి ”.
                            నిగిడి శ్రీ వేంకటపతి  నిజదాసుడై,  భక్తి తగిలి  నిలుపువాడె ధన్యుడైన  యోగి. “.   

అసభ్యమైన  “ కామ క్రోధ లోభ మోహ మాడ మాత్సర్యములను ”  తరిమిగొట్టి,  పారద్రోలి,  ఎలాంటి  షోకులులేని శాంతస్వభావుడైన వాడే,  అసలైన  “ యోగి. “ శ్రీ వేంకటేశ్వరుని “భక్తి “ తగిలినప్పుడేగాని,
ఎవ్వరైనా ఈ , పైన అన్న  ఆరు శత్రు గుణాలనుండి, మనిషి బయటపడలేదు.  భక్తి  అనే తెడ్డుతో, ఈ
ప్రపంచ  బంధాల ప్రవాహాసాన్ని దాటి, ఒడ్డు  చేరగలమంటున్నాడు , శ్రీ  అన్నమయ్య.

“ యోగి “అంటే ,  మూక్కు మూసుకొనికూర్చొనే వాడు కాదు.  ఆసనాలు, ప్రాణాయామం చేసేవాడు కాదు.
ఆ అభ్యాసాలన్నీ,  శరీరాన్ని  సిద్ధంచేసి ,  యోగిని చేసేందుకు  తయారీలు, ప్రయాసలు.  దైవానితో,  అంటే     ఆ “విశ్వమనస్సు “ తో , మనిషిని, “ అనుసంధానం “ చేయడమే “యోగం “ అంటే.

 “ యుజ్జన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషాహ “ అని , “యోగి “ అనే శబ్దాన్ని  నిర్వచించింది. గీత

ఒక జీవాత్మ,  పరమాత్మ తో  అనుసంధానం అవ్వాలంటే,  మొదలు యోగిగా మారి, తర్వాత  ఆ విష్ణు భకుడవ్వాలీ.    భక్తి ఒక “డిటర్జెంట్. “   , మనస్సును శుబ్రపరిచే “మందు “ .

భక్తి,   మనిషిలోని  మలినాన్ని కడిగి, శుద్ధాత్మ.గల ”  యోగి “  గా   
   తయారుచేస్తుంది.  ఇదే  అన్నమయ్య     మాట.

      అన్నమయ్య మాట.        


  
    
 

  
  

      



  





    



   







         
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...