మనస్సుని ఎలాగ నిగ్రహించాలి ? అని , అర్జునుడు శ్రీ కృష్ణుని అడిగితే, ఈ సమాధాన మిచ్చ్చాడు కృష్ణ పరమాత్మ . “”అభ్యాసేనతు , వైరాజ్ఞేన “ కౌన్తేయ. ( భక్తి యోగం , అధ్యాయం 6)
వైరాగ్యాన్ని సాధన చేసి, మనస్సును మలినారహితంగా తయారు చేసుకోవాలి.
ఒకటా భక్తితో , లేదా వైరాగ్యం తో , మనస్సును ఇంద్రియాల మోహమాయ నుండి , తప్పించాలి , అని కృష్ణుని బోధ. వైరాగ్యమంటే ఏంటి? ?? వైరాగ్యం ఎందుకు?? అని అన్నమయ్య , చక్కగా వివరించారు, క్రింది పాటలో.......
“ తెగక పరమునకు తెరువు లేదు , వగయెల్లా విడువక భవమూ బోదు “( 203, సంపుటం 1)
సంసార వ్యామోహాలనుండి, సంసార బంధాలనుండి , సంబంధం తెంచుకోనన్నినాళ్ళు వైరాగ్యం రాదు.
చిత్తములోపల పలు చింతలు మానినదాకా.
సత్తుగా “ వైరాగ్యము “. సమకూడదు.
ఇత్తల శ్రీ వెంకటేశు డేలిన దాసులకైతే
హత్త్తి వైకుంఠ పదవి అప్పుడే కలదు. ( 3, పాట 203 )
మనస్సులో రకరకాల ఆలోచనలు మెదలుతున్నప్పుడు, మనశ్శాంతి ఎక్కడిది. ?.? మనస్సుని అనవసరపు ఆలోచనలనుండి తప్పించి, కట్టి పెట్టినప్పుడే , విషయాలనుండి విరక్తి రాగలదు. అన్నమయ్య “ విరతి “ అంటాడు విరక్తిని. విషయవిరక్తే వైరాగ్యం. అదే స్వచ్ఛమైన మనస్సు. అదే వేంకటేశుని దయకు దోవ. ఏఏ విషయాలను వదిలేయాలి , వైరాగి కాడానికి ? అనేది ఈ క్రింది
చరణాలలో చెప్పాడు.
“కన్నులయెదుటనున్న కాంచనముపై మమత ఉన్నంత తడవు, మోక్షమొనకూడదు
అన్నముతోడి రుచుల అలమట గలదాకా , పన్నిన సుజ్ఞానము పదిలము కాదు. “
“ ప్రక్కనున్న కాంతల భ్రమగల కాలము.
మిక్కిలి శ్రీ హరి భక్తి మెరయలేదు
వెక్కసపు సంసార విధి నున్నంత తడవు.
నిక్కి పరమ ధర్మము నిలకడ గాదు “.
వైరాగ్యం రావాలంటే, వేటి వేటి నుండి మనస్సును నిగ్రహించాలి??
బంగారు పై వ్యామోహం, అతి రుచికరమైన తిండి పదార్ధాలపై మోహం , స్త్రీ లోలత్వం, ఎక్కసమైన సంసార తాపత్రయం వున్నంతకాలం చిత్తం ,శాంతస్థితిని పొందదు. శాంతములేకుండా , సుజ్ఞానాన్ని పొందగలిగే స్థిరబుద్ధి రాదు. రాదంటే రాదు.
సుజ్ఞానమే గదా, వైరాగ్యాన్ని పెంపొందించేది!, శ్రీ వెంకటేశు వైపు ధ్యాసను మరల్చేది.
ఒక్కమాటలో, “ వైరాగ్యం “ అంటే అన్నింటినీ మానసికంగా వదలడం .
ప్రపంచంలో ఉంటూనే, బంధించుకోకుండా , నిమిత్తంగా జీవించడం. అల్లా జీవించేవారికి, పాపపుణ్యాలు అంటావు, తామరాకుపై నీటి బొట్టులాగ.
వైరాగ్యమే మోక్షానికి మార్గం.
అన్నమయ్య మాట