19, జులై 2018, గురువారం

అన్నమయ్యతత్వం

 అన్నమయ్య  వేదాంతమెంతసరళమో, తత్వ జ్ఞానమూ అంత సులభము.
సకల వేదాంత సారాలు కాచి వడబోసి, “పరతత్వము “ అంటే ఏమిటో, పర తత్వ సాధనమెలాగో , మనకు చాలా సరళమైన రీతిలో, పాడి తెలిపారు , శ్రీ విష్ణు అన్నమయ్య.   “ శ్రీ  విష్ణు “ ఆయనకు  బిరుదు.  ఎందుకంటే , అన్నమయ్య  విష్ణుతత్వవేది.  వైష్ణవమే తన  “ పరతత్వం “.  
తత్వమసి “ అనే  పరతత్వ నిర్వచనమునకు   అర్ధము “ విష్ణువు “,  అని తెలిసిన  పరతత్వవేది , అన్నమయ్య. 
తత్ + త్వం + అసి = తత్వమసి .  అంటే ,” అది నీవుగ వున్నావు “.. అని అర్ధము. 
“అది ”  అని , “ఆత్మ ” ను  ఉద్దేశిస్తున్నారు.  సర్వాంతర్యామియైన  “ఆత్మ స్వరూపము ” విష్ణువేనని,  ఈక్రింది సంకీర్తనలో  చెప్తున్నారు, అన్నమయ్య. 

          “ తగిలి చూచిన  “ ఆత్మ “  తను కానరాదుగానీ, జగమెల్ల  తానైతే  సరిగనీని 
               చిగురెంత , చేగెంత , శ్రీపతి యిందులో , నీ “పగటు”  తెలియు వాడే , “పరతత్వవేది “

ఎంత వెదికినా కనపడని ఆత్మ ,లోకమంతా చూస్తూ ,లోకమంతా నిండియున్నది. ఆ  ఆత్మ విష్ణువే . 
విష్ణువు యొక్క  “వెలుగు “ చూచినవాడే  పరతత్వము తెలిసిన  “ పరతత్వవేది.”   “
పగటు” ,  అనే శబ్దాన్ని,   “వెలుగు “ అనే భావంతో  ప్రయోగించారు, అన్నమయ్య.     

               “ పొలసి  మసకమందు  పొడమేటి  జీవుని  తలపు , బ్రహ్మాన్దాలు  దాటిపోయీని    
                   నిలు వెంత,   నీటెంత , నీమాయలివి  భువి , బలము  తెలియు వాడే  “ పరతత్వవేది “

ఒక  తిత్తి లోనుండి , పుట్టేటి  జీవము యొక్క  మనస్సు ( తలపు ), బ్రహ్మాణ్డాలన్నీ  వ్యాపించివున్న 
ఆ  మనస్సు ఒక్కటే .  అదే విశ్వాత్మ, అదే పరమాత్మ. అదే సర్వాంతర్యామియైన “విష్ణుమానసము.” 
కొలతలకు అందని  విస్తీర్ణమైన  ఈ విష్ణు మాయను  తెలిసినవాడే  “ పరతత్వవేది “. 
విష్ణు మనోబలము “  నెరిగినవాడే , అసలు సిసలైన “ పరతత్వవేది “.  (4, సంకీర్తన 363)


మరి , ఈ  విష్ణు శక్తి, “విష్ణు మాయ” , “విష్ణు మనసు” , “విష్ణుఆత్మ” , “విష్ణు కాంతి” , ““విష్ణు వ్యాప్తి “ తెలిసిదేలా?.???? ఒకే ఒక్కమాటలో,  పరతత్వము  బోధపడేదెలాగా?.?.?

        హరి హరి ఇందరికి  అబ్బురముగాని , ఇది పరగ ,  నీ దాసుడే  “ పర తత్వవేది “. 

చెప్తే కొంచం ఆశ్చర్యమనిపించొచ్చుగానీ , చూస్తే అతి సాధారణమైన సూత్రం ,  “ హరి భక్తుడౌటే “

    హరిదాసుడౌటే   “ పరతత్వవేది “ ఔట .     అంతా “వైష్ణవమే”.      అంతా  “విష్ణు తత్వమే “. 

                  అన్నమయ్య  మాట 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...