4, ఆగస్టు 2018, శనివారం

లోకపాలకులు

   అంతరిక్షం గూర్ఛి   శోధించడమంటే  ఆ  దేవునిగూర్చి  తెలిసికో వడమే...... ఒక స్థాయిలో కాస్మాలజీ  ఆధ్యాత్మికతకు మధ్య వ్యత్యాసముండదు. ఎందుకు?  ఏ బ్రహ్మాండాలను గూర్చి, ఏ ఆకాసాంతరాళాలను  గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నామో , వాటన్నిటిలోవున్నది ఆ “పరబ్రహ్మ” తత్వమే గనుక.
అన్నమయ్య  లోకాలను గూర్చి, లోకాలన్నీ ఎలాగ నిలిచి వున్నాయనే విషయం గూర్చి, ముక్తసరిగా , కొన్ని సంకీర్తనలలో చెప్పారు.   

14 శాశ్వతాలోకాలకు నాల్గు వైపులనున్న ఛానెల్స్ , అంటే దారులలోని తేజస్సును చూచి, ఆ దారులలో పయనించి, వెలుపలికి వచ్చాను, అని చెప్పాడు.  ( సంపుటం 4, సంకీర్తన). అన్నమయ్య  విష్ణువు  అంశతో
పుట్టానని  ఒక  సంకీర్తనలో చెప్పాడు.

ఏఏ లోకములోనైనా, ఆ లోక  కేంద్రం “ పరబ్రహ్మ “ స్థానం. . . ఆ పరబ్రహ్మ చుట్టూ వున్న పరిథి ,   బ్రహ్మలు ,   
   రోమకూపములు, రుద్రులు ఉండే  స్థానం.
  
  . పాట 333, సంపుటం 3, లో, యీ ముఖ్యమైన  విషయాన్ని ఇలాగ చెప్పాడు.                           

  “  ఒక్కడెవ్వడో ఉర్వికి  దైవము , ఎక్కువ  నాతని ఎరుగవో  మనసా “                                               

                           “ వొ ట్టిన జీవులకొక బ్రహ్మగలడు “     
                               నత్తనడుమ వారే నవబ్రహ్మలు
                                  జట్టుగా బ్రాహ్మలు సంతాయే జగము “
  
   పుట్టబోవు జీవురాసి నిలయం ఒక బ్రహ్మ.  లోకము నట్ట నడుమ  9మంది బ్రహ్మలు గలరు. అదీగాక , అనేక వ్యూహాత్మక స్థానములలో పెక్కు బ్రాహ్మలు లోకమంతా వున్నారు. లోకమంతా బ్రహ్మల  సంత లాగ
వుంటుందట. బ్రహ్మలు  “ సజీవ శక్తి  కేంద్రాలు. “ సృష్టి కారక  కేంద్రాలు. “ఒక్కొక్క  బ్రహ్మ ఒక్కొక్క కార్యానికి  నియమించబదినవి. .   “ముంచెడి  బ్రహ్మలు “ అని ఒక పాటలో చెప్పడం ఉంది.  అంటే,  కొన్ని  గ్రహములుగానీ…,  నక్షత్రములుగానీ,  వేరే ఖగోళ మండలములుగానీ బలహీనమైనప్పుడు క్షీణించగా ,    యీ
“ముంచెడి  బ్రహ్మలో నిబిడీకృతంఔతాయి. ఇవి “ వొట్టిన బ్రహ్మలు . మరేమో, పుట్టబోయే జీవరాశి    నిలయం   ఇంకో బ్రహ్మ. ఈ నవబ్రహ్మలకు అధిష్టానకేంద్రం “ బ్రహ్మలోకం “. 

                              కైలాసంబున కలడొక  రుద్రుడు.      
                               తాలిమి ఏకాదశ రుద్రులు మరి
                                 కాలరుద్రుడు కడపట  నదివో
                                   చాలిన  రుద్రుల  సంతాయే  జగము.  

రుద్ర స్థానములు 11.  రుద్రస్థానాలన్నింటిని కంట్రోల్ చేసే  స్థానం కైలాసం  . 
 రుద్రుల పేర్లు ఉదాహరణకు ,     కపిల, పింగళ, భీమా , విరూపాక్ష , విలోహిత, శాష్టా , శాసన,               అజేష.మొదలైనవి. విభిన్నమిన  పేర్లతో పిలువబడతాయి . కడపటిది  కాల రుద్రుడు. ప్రతి       లోకమొక    రుద్రుల సంతే .  
   కానీ, “కైలాసము ” లో ఒక్క రుద్రుడు, ఏకాదశ రుద్రుల “అధిష్టానకేంద్ర , పేరు శివుడు.             
రుద్రుడు  “ అగ్ని కేంద్రము. “ అగ్ని భండారము. “.
      అవసరంలేని, కాస్మిక్ అస్తిత్వాలను కాల్చి వినాశము చేయు పని రుద్రులది. ఒక్కోక్కరుద్రునికి వేరే  వేరే.   మోతాదులలో పని ఉంటుంది.

“  అవతారంబున అలరినవిష్ణువు, ఆవల విష్ణుమా యమననియ్యుడి విష్ణువు”

      విష్ణు పదములో నున్న పరంజ్యోతి “ విష్ణు వు  “,  మొత్తం అన్ని లోకాలను  కాపాడుతుండును.  
ఈ నూరవ పడి లోనున్న  విష్ణువే  తన అంశం తో అన్ని పాలకులలో ఉండడమైంది . విష్ణువు సర్వ   లోక  రక్షకుడు. విష్ణు నామ కాంతిలోఅన్ని విధాలా  శక్తి రూపాలు వుంటాయి.  

“”.  ఓజస్ తేజస్ ద్యుతి  సర్వ శక్తి ధర. ఉజ్వల ప్రజ్వల  రూపం , “ విష్ణు. “.

 లోకములోనగల అనేక రోమకూపములలోనున్న వెదజల్లబడే కాంతి, విష్ణు కాంతి.
రోమ కూపములు   విష్ణుకాంతిని  కాస్మోస్లో  సమంగా  ప్రసరింపజేసే  “” హెడ్  లైట్”  లాంటివి.  

లోకపాలకులు: 
                           1.   సజీవ  శక్తిధారణకేంద్రములు  ( బ్రహ్మలు )

                           2.   విష్ణుకాంతి కేంద్రములు  ( రోమకూపములు)
                          
                             3.   అగ్ని కేంద్రములు  (. రుద్రులు). 
                  
                                 4.   సృష్టి  జనక  లోక కేంద్రం.  ( పరబ్రహ్మ).

లోకపాలనా   కేంద్రములకు  “ మనస్సు  “ కున్న గుణములు  ఉండుటవలన ,  వానిని  కేవలము  “ స్థానములు  “ గా  కాకుండా, సజీవ స్వరూపములుగా  భావించవలసి  ఉన్నది.   అందువలననే    మనము, బ్రహ్మను  “ బ్రహ్మము”.  ,  పరబ్రహ్మని   “పరబ్రహ్మము”. , రుద్రుని  “  రుద్రుడు””, అని    సంభోదించడమౌతున్నది.   

లోకపాలకులు  ప్రకృతితో  కూడి  ఏ  రూపమైనా   ధరించగలరు.  మన ఊహకందని  అద్భుతమైన  పవర్స్  అగు   లోకపాలకులు  తమ  తమ  కర్తృత్వము  నడుపుతూనే  వుంటారు.  
అది  “  కాస్మిక్ నియమము. “,  “  కాస్మిక్  రహస్యము”.   కూడా.   

అన్నమయ్య మాట 



                          


   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...