సర్వాంతర్యామి ఐన శ్రీ మహా విష్ణువునకు , శ్రీ మహా లక్ష్మీకిని వ్యత్యాసమే లేదు.
ఇద్దరికి ఒకే వైభవము, ఒకే బలము వున్నది, అని అన్నమయ్య చాలా తియ్యని మాటలతో , తన సంకీర్తనలో చెప్తున్నారు. కలకాలము ప్రతిదినమూ మహా వైభవంతో మనసే విష్ణువు , లక్ష్మి వేరువేరుగాదు, సకల సృష్టీ , సర్వమూ ఆ వైష్ణవమే నని , వొక్కాణించారు ఇలా.........
రామనామమతనిది రామవు నీవైతేనూ
చామన వర్ణమతడూ , చామనయవు నీవు
వామనుడు అందురతని , వామనయవు నీవూ
ప్రేమపు ఇద్దరికి “ పేరు బలము ఒకటే “
“రమా , రామ” అంటే , “లక్ష్మియు విష్ణువు “ అని అర్ధము.
వామనావతారం విష్ణువే, ఆ విష్ణువు ,ఎడమ వైపున్నది లక్ష్మీ దేవియే ..
వారిద్దరికి ఒకరిపై యింకొకరికి ఎంతో ప్రేమవుంది. ఇద్దరి కున్న తేజస్సు, ఓజస్సులు సమానమే ,
అని అన్నమయ్య చెప్తున్నారు.
జలజనాభుడతడు , జలజముఖివి నీవు
అలమేలు మంగవు నీవు, అలమే తాను
ఇలలో శ్రీ వేంకటేశుడు , ఇటునిన్నురానామోచే
పిలిచి పేరు చెప్పే , పేరు బలము ఒకటే. ( 280, సంపుటం 7)
విష్ణువు పద్మనాభుడట. మరి లక్ష్మీ దేవి పద్మమువలె అందమైన ముఖముగలదట.
ఈ భూమిపై, వారిద్దరూ శ్రీ వేంకటేశుడు , అలమేలుమంగగా కొలువై వున్నారు.
అలమేలు మంగకు, శ్రీ వెంకటేశునికి వున్న ఓజస్సు తేజస్సులు , ఒకే విధమైనవి, సమానమైనవి, అని అన్నమయ్య చెప్తున్నారు.
ఇక్కడ గూఢార్థమేమిటంటే, విష్ణువునకు లక్ష్మికి భేదం లేదు. ఇద్దరూ ఒకటే . ఇద్దరికున్న బలము సమానమంటే , ఇద్దరూ ఒకటేనని అర్ధము.
విష్ణువే వైష్ణవి. హరియే హరిణి. పద్మనాభుడే పద్మావతి.
శ్రీ మహా విష్ణు వైభవమే శ్రీ మహా లక్ష్మి.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి