అన్నమయ్య , వేదోపనిషత్తులు, భగవద్గీతోపనిషత్తులను కాచి వడపోసిన మహా జ్ఞాన ధర్మజ్ఞుడు.
ఇన్ని వేల సంకీర్తనలను అనర్గళంగా పాడడం సామాన్యులకయ్యే పని కాదు. భక్తి ఙ్నానా ల భావ
సమ్మేళనం, అన్నమాచార్యులవారి ప్రతి గీతం.
“ బ్రహ్మం పరబ్రహ్మం , జ్ఞానం జ్ఞేయం, జీవాత్మ పరమాత్మ “ అనే విషయాలను గూర్చి , భగవద్గీతలో ని సంస్కృతభాషనుండి , తెలుగుభాషలో సంకీర్తన రూపంలో వివరించి , ఈ లాగ పాడారు. వేదాలు చెప్పిందీ ఇదే , అని గెంతుతూ డేం డేం అని అరుస్తూ చెప్తున్నారు.
“ఓహో డేం డేం ఒగి బ్రహ్మమిదియని , సాహసమున శృతి చాటెడిది “. (396, సంపుటం )
“ పరము దేవుడును , అపరము జీవుడు
తిరమైన ప్రక్రుతి యే దేహము “
“జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమున , పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ , జ్ఞేయము పరమాత్మ , జ్ఞానగమ్యమే సాధించు మనసు “
మనస్సును నిగ్రహించి, ఈజీవాత్ముడు, జ్ఞానమార్గంలో , జ్ఞానంతో జ్ఞానగమ్యమైన పరమాత్మను తెలిసికొనుటయే నిజమైన యోగం , అని అన్నమయ్య భావం. అదే , భగవద్గీతలోని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో చెప్పియున్నది యిలా. .........
“ జ్యోతిషామపి తత్జ్యోతిహి తమసః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం “
ఏ వెలుగు సృష్ఠి యంతయూ వ్యాపించియుండి, ఏ తన ప్రకాశముతో చీకటిని పారద్రోలుచున్నదో ,
అదియే, “ పరము “ అని పిల్వబడుచున్నది. ఆ వెలుగే జ్ఞానరూపం. ఆ వెలుగే దైవరూపం . ఆ వెలుగే హృదయంలో నున్న “మనసు “. అంటే , మనస్సే సర్వవ్యాపియైన పరమాత్మ .
ఈ శరీరం సహాయంతో, ఆ పరమాత్ముని తెలిసికోవడమే జన్మసార్థకత .
మనసే మనస్సును తెలియగలదు . అదే వేదాంత రహస్యం.
అదే అన్నమయ్య సంకీర్తన గీతాబోధ.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి