అన్నమయ్య , విష్ణుచక్రం ఎలాగుంటుంది?, ఎక్కడ ఉంటుంది?, ఎందుకుంది?, విష్ణు చక్రం నిర్మాణమేమిటి ?, విష్ణు చక్రమేలాగ పని చేస్తుంది? ...... అన్నీ వివరంగా , ఒక సంకీర్తనలో వివరించారు.
3వ సంపుటంలో నున్న 282 వ సంకీర్తన లో , ఇలాగున్నది.
విష్ణు పదములో , అంటే వైకుంఠములో నున్న “విష్ణు చక్రము ” దుష్టశిక్షణకోసము, శిష్టరక్షణకోసమే “ ఉన్నదన్న విషయము , మనందరికీ తెలిసినదే.
ఇక్కడ, గ్రహించవలసినదేమిటంటే, “ధార “ కు మరో పదము “ గోపిక “.
16000 గోపికలతో, చుట్టుతూ, విశ్వాన్ని నడుపు తున్నాడు , ఆ జగన్నాటక సూత్రధారియగు శ్రీ మహా విష్ణు .
అన్నమయ్య మాట
3వ సంపుటంలో నున్న 282 వ సంకీర్తన లో , ఇలాగున్నది.
“నమో నమో దానవ వినాశ చక్రమా , .......
అట్టే పదారు భుజాల నమరిన చక్రమా
అరయ. ఆరు కోణాల నమరిన చక్రమా
ధారలు వేయి తోటి తగు చక్రమా “
విష్ణు చక్రము 16 భుజాలతో , “వేయి విష్ణుకాంతి ధారలు ” వెదజల్లుచు, తిరి గేటి మహా ప్రకాశ మానమైన తేజోమయ శక్తి చక్రము. అంటే , 16 * 1000= 16000 విష్ణు కాంతి ధారలు అన్ని దిక్కులలో వెదజల్లుచు ,
శోభాయమానంగా చుట్టుతూ ఉంటుంది , అని భావము.విష్ణు పదములో , అంటే వైకుంఠములో నున్న “విష్ణు చక్రము ” దుష్టశిక్షణకోసము, శిష్టరక్షణకోసమే “ ఉన్నదన్న విషయము , మనందరికీ తెలిసినదే.
ఇక్కడ, గ్రహించవలసినదేమిటంటే, “ధార “ కు మరో పదము “ గోపిక “.
కనుక, విష్ణు చక్రము , 16000 “ గోపికల “ తో ( విష్ణుకాంతి ధారలతో )చుట్టుతూ తిరిగే చక్రము , అని భావించవలెను.
విష్ణుడే కృష్ణుడు గా అవతరించాడు. అందువలన, శ్రీ కృష్ణుని చుట్టూ 16000 గోపీలున్నవి, అని ప్రతీతి లోకి వఛ్చినది. అసలు విషయం , “16000 విష్ణుకాంతి ధారాలకు మరో పేరే , 16000 గోపికలు. “16000 గోపికలతో, చుట్టుతూ, విశ్వాన్ని నడుపు తున్నాడు , ఆ జగన్నాటక సూత్రధారియగు శ్రీ మహా విష్ణు .
అన్నమయ్య మాట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి