28, అక్టోబర్ 2018, ఆదివారం

గోపికలు ఎవరు ??

అన్నమయ్య ,  విష్ణుచక్రం ఎలాగుంటుంది?, ఎక్కడ ఉంటుంది?,  ఎందుకుంది?, విష్ణు చక్రం  నిర్మాణమేమిటి ?, విష్ణు చక్రమేలాగ  పని చేస్తుంది? ...... అన్నీ వివరంగా , ఒక సంకీర్తనలో  వివరించారు.
  3వ  సంపుటంలో నున్న 282 వ సంకీర్తన లో , ఇలాగున్నది.

“నమో నమో దానవ వినాశ  చక్రమా , .......

      అట్టే పదారు   భుజాల  నమరిన చక్రమా

         అరయ.   ఆరు కోణాల  నమరిన  చక్రమా

           ధారలు వేయి తోటి  తగు చక్రమా “


విష్ణు చక్రము  16 భుజాలతో  , “వేయి  విష్ణుకాంతి ధారలు ” వెదజల్లుచు, తిరి గేటి  మహా ప్రకాశ మానమైన  తేజోమయ  శక్తి చక్రము.  అంటే ,  16 * 1000=  16000  విష్ణు కాంతి ధారలు  అన్ని దిక్కులలో వెదజల్లుచు ,

శోభాయమానంగా  చుట్టుతూ ఉంటుంది   , అని భావము.
విష్ణు పదములో , అంటే  వైకుంఠములో  నున్న  “విష్ణు చక్రము ” దుష్టశిక్షణకోసము,  శిష్టరక్షణకోసమే “ ఉన్నదన్న విషయము , మనందరికీ తెలిసినదే.

ఇక్కడ, గ్రహించవలసినదేమిటంటే,   “ధార “ కు మరో పదము  “ గోపిక “.

కనుక,  విష్ణు చక్రము , 16000 “ గోపికల “ తో  ( విష్ణుకాంతి  ధారలతో )చుట్టుతూ  తిరిగే  చక్రము  , అని భావించవలెను.  

విష్ణుడే  కృష్ణుడు గా అవతరించాడు. అందువలన,  శ్రీ కృష్ణుని చుట్టూ 16000 గోపీలున్నవి, అని ప్రతీతి లోకి వఛ్చినది.  అసలు విషయం , “16000 విష్ణుకాంతి  ధారాలకు మరో పేరే   , 16000 గోపికలు. “

16000 గోపికలతో,  చుట్టుతూ,  విశ్వాన్ని  నడుపు తున్నాడు , ఆ జగన్నాటక సూత్రధారియగు  శ్రీ మహా విష్ణు .

                           అన్నమయ్య  మాట 


23, అక్టోబర్ 2018, మంగళవారం

గోవర్ధనమెత్తుట

అన్నమయ్య ఎన్నో వందల సంకీర్తనలు , శ్రీ కృష్ణునిపై పాడారు.  సంకీర్తనల ద్వారా  ఎన్నో  గొప్ప గొప్ప విషయాలు తెలియజేసారు. ఎన్నో కృష్ణుని లీలలు  వర్ణిస్తూ  పాడారు.   శ్రీ  కృష్ణుడు, విష్ణు దేవుని అవత్తరమౌట వల్ల ,  విష్ణుడే అంతాయనే  భావన అన్నమయ్య పాటలలో చాలా చక్కగా కనిపిస్తుంది.
ఒక సంకీర్తనలో, విష్ణుని శ్రీ కృష్ణుని  లీలలు సమ్మేళవించి, ఎంతో  మనోహ్లాదంగా  పాడారాయన.

చిన్ని కృష్ణుడు ఆడుతూ  ఆడుతూ  మట్టి తినగా , యశోదాదేవి,  ఆ ముద్దు బాలకృష్ణుని ,  నోరుతెరిచి  చూపించమన్నది.  అద్భుతంగా, 14 భువనబాండాలు  కనిపించినవట. ఆ కృష్ణ పరమాత్మునిలోనే 
సర్వసృష్టి వున్నది, అని  ఆమెకు  తెలిసిపోయింది. 

అల్లాగే ,  తన మిత్రులతోకూడి  బాలకృష్ణుడు  ఆటలాడడానికి  పోగా, హాఠాత్త్తుగా  ఉరుములతో, మెరుపులతో , కుంభవృష్టి పడడమైంది.  అప్పుడు , శ్రీకృష్ణుడు“ గోవర్ధన పర్వతమును “ ఎత్త్తి,తన చితికినవేలుమీద  నిలిపి,  ఆ  గోపాలలులనందరిని , ఆ పర్వతముక్రిందన  బసచేయించెనట. 

ఎన్ని దినములు. ? ఒక్కటా, రెండా??  “ఏడు రోజులు ”  అలా  వర్షమాగకుండా  పడుతోనే వున్నది, 
శ్రీ గోపాల కృష్ణుడు  గోవర్ధన గిరిని  చిటికిన వేలుపై  నిలిపి, యెత్తి  నిలుచునేవున్నాడట. 
ఎటువంటి  అద్భుతమైన  సన్నివేశమిది !! ఏడురోజులు  ఒక కొండనెత్త్తి , చితికినవేలుపైనిలిపి,  నిలుచుకోవడం , ఏ  మానవమాత్రుడికైనా  సాధ్యమా??  ఒక్క  భగవంతునికే  సాధ్యము. 
ఈ  మహాద్భుత సన్నివేశాన్ని,  బాలకృష్ణుని  లీలను  అన్నమయ్య , క్రింది  సంకీర్తలో యిలాగ,  బహుచక్కగా  వర్ణించారు. 

                  “ అతి బ్రహ్మామ్డాలు  కుక్షి నటు ధరించినట్టి  ఆతనికి  చేయరో  ఆరగింపులు 

                       ప్రతిలేని  క్షీరాభ్ది  పవళించి  లేచినట్టి , చతురునికి  చేయరో  చవినారగింపులు 
పల్లవి :
వేకువ  తిరుపళచ్చి  విష్ణునికి చేయరో , ఆకటికి  ఒదగినట్టి  ఆరగింపులు —( 3, సంకీర్తన 298 )

                     “ ఏడు  దినముల దాకా   నెత్తెను  గోవర్ధనము 

                          ఆడి  వఛ్చిన  బాలునికి   ఆరగింపులు “

ఈలాంటి   భాగవత రహస్యాలనెన్నింటినో  తన  పాటలలో  నిక్షిప్తముగా  తెలిపారు , శ్రీ అన్నమాచార్య . 


                                అన్నమయ్య  మాట 



10, అక్టోబర్ 2018, బుధవారం

పరమాత్మ రూపాలు

అన్నమయ్య  “ పరమాత్మ “ నెలవున్న స్థానములు , విషయములు యివి , అని  కొన్ని ఉదహరించారు , ఒక సంకీర్తనలో . 
భగవద్గీతలో , “విభూతియోగం”లో కూడా , పరమాత్మ  నెలవున్న  స్థానములు  కొన్ని  చక్కగా 
చెప్పారు, శ్రీ కృష్ణ పరమాత్మ.  అదే   విధంగా , శ్రీ అన్నమాచార్యులవారు  కూడా,  క్రింది  సంకీర్తనలో  నిర్దాకరించి , దైవముయొక్క  నిలకడలు గూర్చి పాడారు.   
పరమాత్మ యెక్క డెక్కడున్నాడు ?  పరమాత్ముడు ఏ ఏ  రూపాలలో  ప్రకటమై  యున్నాడో , ఒక చక్కని సంకీర్తనలో  వివరించారు, అన్నమయ్య. ఈ  భూమి మీద , కొన్ని విశేష రూపాలలో వ్యక్తమై, 
 మనలకు   అందుబాటులోనే   వున్నాడు , పరమాత్ముడు.  ఈ క్రింది  సంకీర్తనలో  విశదీకరించారు అన్నమయ్య. 

             “ పట్టినవారిచేబిడ్డ  పరమాత్ముడు , బట్ట బయటి ధనము  పరమాత్ముడు 
                    పట్టపగటి  వెలుగు  పరమాత్ముడు , యెట్టనెదుటనే  ఉన్నడిదే  పరమాత్ముడు “

గట్టిగానమ్మితే  ఆ పరమాత్ముడొక  చంటిబిడ్డలా  మనతో  చేతిలోనే  ఉంటాడట.  ధర్మంగా సంపాదించిన సంపదే  పరమాత్ముడు.  “పగలున్న వెలుతురే “ , మన ఎదుటే  వున్న “వెలుతురే “
పరమాత్ముడు. 

“పచ్చ్చిపాలలోని  వెన్న  పరమాత్ముడు, పచ్చ్చినవాసిన  రూపు  పరమాత్ముడు 
బాచుచు చేతి వొరగల్లు  పరమాత్ముడు , ఇఛ్చకొలది వాడువో  యీ  పరమాత్ముడు ”

పాలలోవెన్న, ఆకు పచ్చ్చటి  రంగు , “ పరమాత్ముడు యే ”. 

                 “ పలుకులలోని  తేట   పరమాత్ముడు , ఫలియించునిందరికినీ  పరమాత్ముడు 
                    బలిమి  శ్రీ వేంకటాద్రి  పరమాత్ముడు,  ఎలిమి  జీవుల  “ప్రాణ” మీ  పరమాత్ముడు “

మాటలోని “నిజాయితీ “, సకల జీవులలో “ ప్రాణ శక్తి “  యూ పరమాత్ముని రూపాలే. 

పల్లవి  :  
భక్తి  కొలది  వాడే “ పరమాత్ముడు “,  భక్తి ముక్తి  తానే  ఇచ్చుఁ భువి  “ పరమాత్ముడు “. 

    (సంకీర్తన 410, సంపుటం 1)
ఎంత  భక్తో , అంత  చేరువగా ఉంటాడు పరమాత్ముడు . ఎంత  చేరువో  అంత  శీఘ్ర మోక్షము .  

పరమాత్ముని  విభూతి :         
                                      వెన్న , పచ్చ్చని రంగు , ప్రాణశక్తి , సత్యవాక్కు , పట్టపగటి వెలుగు ,
                                      న్యాయార్జితం , బంగారు ,  శ్రీ వేంకటేశుని కనిపించే  రూపాలు. 
పైనచెప్పినవి  పూజార్హములు.  ఎవ్వరికైనా  అందుబాటులోనున్నవే. 

దైవము  ఎక్కడో వున్నాడని,  ఎదో  అదృశ్యమని  భావించవద్దు.  ఎట్టఎదుటనే  వున్న  “ వెలుగే “
చాలుగా ... మనతోనే , మనలోనే  వున్నాడు. అతి సులభుడు,  భక్తి  గలవారికి.  హాఁ , నమ్మినవారిని 
వదలకుండా,  వెంట వెంట  తోడునీడగా  వుంటాడు . కాపాడుతాడు .. ....      


                       అన్నమయ్యమాట  

2, అక్టోబర్ 2018, మంగళవారం

అన్నమయ్య గీతార్ధం

  అన్నమయ్య , వేదోపనిషత్తులు, భగవద్గీతోపనిషత్తులను  కాచి వడపోసిన మహా జ్ఞాన ధర్మజ్ఞుడు. 
ఇన్ని వేల సంకీర్తనలను  అనర్గళంగా  పాడడం  సామాన్యులకయ్యే  పని కాదు.  భక్తి ఙ్నానా ల భావ 
సమ్మేళనం, అన్నమాచార్యులవారి ప్రతి గీతం. 

“ బ్రహ్మం  పరబ్రహ్మం ,  జ్ఞానం  జ్ఞేయం,  జీవాత్మ పరమాత్మ “ అనే  విషయాలను గూర్చి , భగవద్గీతలో ని  సంస్కృతభాషనుండి ,  తెలుగుభాషలో సంకీర్తన రూపంలో వివరించి , ఈ లాగ  పాడారు. వేదాలు చెప్పిందీ ఇదే , అని  గెంతుతూ డేం డేం అని అరుస్తూ చెప్తున్నారు. 

“ఓహో డేం డేం ఒగి  బ్రహ్మమిదియని , సాహసమున  శృతి చాటెడిది “. (396, సంపుటం )

                “     పరము  దేవుడును ,  అపరము  జీవుడు 
                      తిరమైన  ప్రక్రుతి యే  దేహము “

“జ్ఞానము  జ్ఞేయము  జ్ఞానగమ్యమున , పూని తెలియుటే  యోగము 
జ్ఞానము  దేహాత్మ , జ్ఞేయము పరమాత్మ , జ్ఞానగమ్యమే  సాధించు మనసు “

మనస్సును  నిగ్రహించి, ఈజీవాత్ముడు,  జ్ఞానమార్గంలో , జ్ఞానంతో  జ్ఞానగమ్యమైన  పరమాత్మను  తెలిసికొనుటయే  నిజమైన  యోగం , అని అన్నమయ్య భావం. అదే , భగవద్గీతలోని  క్షేత్ర క్షేత్రజ్ఞ     విభాగయోగంలో  చెప్పియున్నది యిలా. .........   

       “    జ్యోతిషామపి  తత్జ్యోతిహి  తమసః  పరముచ్యతే 
              జ్ఞానం  జ్ఞేయం  జ్ఞానగమ్యం  హృది  సర్వస్య విష్టితం  “   

ఏ  వెలుగు సృష్ఠి యంతయూ  వ్యాపించియుండి, ఏ తన ప్రకాశముతో  చీకటిని పారద్రోలుచున్నదో , 
అదియే,   “ పరము “ అని పిల్వబడుచున్నది. ఆ వెలుగే  జ్ఞానరూపం. ఆ వెలుగే  దైవరూపం  . ఆ వెలుగే హృదయంలో నున్న “మనసు “. అంటే , మనస్సే  సర్వవ్యాపియైన  పరమాత్మ .   

ఈ  శరీరం సహాయంతో,  ఆ పరమాత్ముని  తెలిసికోవడమే  జన్మసార్థకత .   
                           
మనసే మనస్సును తెలియగలదు . అదే  వేదాంత రహస్యం. 
అదే అన్నమయ్య సంకీర్తన గీతాబోధ. 

            అన్నమయ్య మాట 
   
                      



గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...