అన్నమయ్య మహా జ్ఞాని. ఆయన వేదోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను అవపోసనపట్టిన వేదాంతి. స్వయం విష్ణ్వామ్స సంభూతుడు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవికి సుఖదుఃఖములు , కష్టసుఖములు, జనన మరణములు ,ఆసా పాశములు తప్పవు, ఎవ్వరు తప్పించుకోలేరు అని నొక్కి చెప్పిన మహా ఆచార్యులు, అన్నమయ్య. ఏ జాతివారికైనా , ఏ దేశమువారికైనా సంసారయోగము ఒక్కటే. ఒక్కటే.
అది ఏమిటో అంటే , ఇది అని, క్రింది మాటలలో చెప్తున్నారు.
పుట్టినవానికెల్లా భువి మరణము నిత్యము,
అట్టే చఛ్చినవారికి అవ్వల జననము
భూమిమీద జన్మమెత్తిన వారెవ్వరైనా గిట్టక తప్పదు. ఇది అపర సత్యము. సృష్టి నియమము.
భగవద్గీత లో “ జాతస్యహి ధ్రువో మృత్యుహు, ధృవం జన్మ మృతస్యచ “ అని చెప్పబడినది.
పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు, పోయిన ప్రతి జీవి పుట్టక తప్పదు. ఈ, ఈ నిజం తెలిసి జీవించడమే
ఒక కళ .
జీవుడు ఎన్నో జన్మల చక్రంలో పరిభ్రమించుతూవుంటాడు. మనము దుస్తులు మార్చినట్లే ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క రూపధారణ చేయడం జరుగుతుంది. ఈ చక్రభ్రమణం నుండి తప్పించుకోడానికి మార్గం ఏమిటంటే, ధర్మబద్ధమైన పనులు చేస్తూ జీవించడమే. ఇదే వివేకవంతమైన జీవితము.
మనముందున్నదంతా దైవీకమైనదని, సర్వమూ దేవదత్తమని , మనము నిమిత్తమాత్రులమని, తెలిసి
యీ అరుదైన మానవ జన్మని జాగ్రత్తగా, ధర్మబద్ధంగా గడపడమే, “ సంసారయోగము “ అని చెప్తున్నారు, అన్నమయ్య.
జీవుడు నిత్యుడు ఏమిటా చెరుపగరానివాడు
ఈ వివేకము తెలిసి ఏ జాతివారైనా
దైవీకమే నమ్మి తమ ధర్మములబాయరాదు
సావధానమిదియే సంసార యోగము
జనన మరణముల నడుమనున్న జీవిత కాలమును సత్యమార్గములో , ధర్మమార్గములో నడపమని,
అన్నమయ్య సావధానం చేస్తున్నారు. పుట్టుట పోవుట చాలా చేదు నిజము. కానీ ఒప్పక తప్పదు గదా !
అన్నమయ్య మాట