18, జులై 2020, శనివారం

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో  జంట  పారి “    -        

ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తున్న  యీ  “కొరోనా " కట్టడి పరిస్థితియే  ఏర్పడినది. బయట తిరగాలన్నా , ఒంటరిగానే ,జత  లేకుండా  తిరగాల్సిందే. ఉఫ్,,ఓహో , ఏ  పరిస్ధితిది ? అని అనాల్సి వచ్చిందట.  ఆ  రోజుల్లో , ఏమేమిజరిగిందంటే .... 


“కోనేటిరాయడు   కోరి  నిద్రించీ  వాడే , ఆనకమై  జాలీయరో   అడు బారీ 
పేనిపెట్టి  వాకిళ్ళ  బీగముద్రలాయ  నిడి , కానిమ్మని  వాయించరో  గంట పారి “
    అందరికోరికలు తీరిచే  ఆ వేంకటేశుడే , కోరి నిద్రపోవాలనుకొన్నాడు. అంటే, విస్రాంతి  కొరుతున్నాడు.. కాబట్టి , గుడి ద్వారములు  మూసివేయబడినవి.  ఎలాగ?,  పేనినతాళ్ళతోగట్టి, తాళాలు బిగించి, సీలు వేశారట.  సీలు వేయడమంటే , ఒక్కరోజుగాదు, రెండు రోజులుగాదు , చాలా 

చాలా రోజులు మూసివేశారని తెలియబడుతోంది . గుడి గంటలు మాత్రమే, టైం చూచి మోగించబడ్డవి. ఆ  శ్రీనివాసునికి  ప్రశాంతత కావాలట. ఎలాగ? ఈలాగ ......   

      “  తిరుపణి   మణగెను  తిరుగరాదెవ్వరికి , మరల నెలుగియ్యరో   మగపారి 
                  పరగ   దేవతలెల్ల  బడకెళ మున్నారు ,  ఇరవాయ  సూర్యచంద్రులెదురుపారి “ 

తిరుపతి  నిశ్శబ్దంగా ఉండాలికనుక,  ఎవ్వరూ బయట  తిఱుగకూడదు. మణగెను అంటే , మౌనముగా అయినది  అని అర్ధం. కొండమీద, స్వామితో  బాటున్న దేవతలు కూడా  అలసట తీర్చుకుంటున్నారు ... ఏమి దృశ్యమైయిందంటే,  సూర్యచంద్రులెదురెదురుగా , గ్రహణ స్థితిలో 
నిలచుట. ఓహో, ఓహోహో ,అనేక తప్పదు ... తిరుపతి  మొత్తం  నిశ్శబ్దం, నిర్బంధం పాటించింది. 
గ్రహణం ముగిసినాక, తలారి  ఎలుగెత్తి “హోషియారీ “ చెప్తాడు. 

“శ్రీవేంకటేశుడు  చిత్తగించీ   లోననదె ,   కోవరము   ఎన్నికరో   కోటిపారి 
ఆవల  బంగారు గుడియలు  ఘల్లురనగా , తావుల  హనుమంతు  తలారి  పారి “ 

           మూసివేసిన గుడి వెలుపల నుండే , కోరికలు కోరుకోండి. కోటి కోరికలైనా  కోరుకోండి ,  పరవాల్లేదు. లోపలినుండే  విని , శ్రీవేంకటేశ్వరుడు  కోరిన వరాలు  తీరుస్తాడు .. లోన  బంగారు  గుండిగలు  ఘల్లు ఘల్లు మంటున్నాయి. అంటే , లోన శ్రీ మహాలక్ష్మి యున్నది , అని అర్ధము. 
మూసివేయబడ్డ  కోవెలను  కాపలాకాయుచూ ,  శ్రీ ఆంజనేయస్వామి  రక్షకుడై వున్నాడు.  
ఇదిఅంతా చూచి , ఓహోహో  అనకతప్పదు, అంటున్నారు శ్రీ అన్నమాచారులవారు. 

అది అన్నమయ్య కాలం.  ఇది అత్యాధునిక  కాలం.  కాలం వేరే  కానీ , కష్టాలు అవే . 
అదే  వేంకటేశుడు, అదే కోవెల , అదే సూర్యచంద్రులు, అదే దేవస్థానము, అదే  విషమ పరిస్థితి, నాడు -నేడు. 
సాహసించి తిరగడం మహా  ప్రమాదమైన విషమ విష పరిస్థితి. 
అది 



        



28, అక్టోబర్ 2018, ఆదివారం

గోపికలు ఎవరు ??

అన్నమయ్య ,  విష్ణుచక్రం ఎలాగుంటుంది?, ఎక్కడ ఉంటుంది?,  ఎందుకుంది?, విష్ణు చక్రం  నిర్మాణమేమిటి ?, విష్ణు చక్రమేలాగ  పని చేస్తుంది? ...... అన్నీ వివరంగా , ఒక సంకీర్తనలో  వివరించారు.
  3వ  సంపుటంలో నున్న 282 వ సంకీర్తన లో , ఇలాగున్నది.

“నమో నమో దానవ వినాశ  చక్రమా , .......

      అట్టే పదారు   భుజాల  నమరిన చక్రమా

         అరయ.   ఆరు కోణాల  నమరిన  చక్రమా

           ధారలు వేయి తోటి  తగు చక్రమా “


విష్ణు చక్రము  16 భుజాలతో  , “వేయి  విష్ణుకాంతి ధారలు ” వెదజల్లుచు, తిరి గేటి  మహా ప్రకాశ మానమైన  తేజోమయ  శక్తి చక్రము.  అంటే ,  16 * 1000=  16000  విష్ణు కాంతి ధారలు  అన్ని దిక్కులలో వెదజల్లుచు ,

శోభాయమానంగా  చుట్టుతూ ఉంటుంది   , అని భావము.
విష్ణు పదములో , అంటే  వైకుంఠములో  నున్న  “విష్ణు చక్రము ” దుష్టశిక్షణకోసము,  శిష్టరక్షణకోసమే “ ఉన్నదన్న విషయము , మనందరికీ తెలిసినదే.

ఇక్కడ, గ్రహించవలసినదేమిటంటే,   “ధార “ కు మరో పదము  “ గోపిక “.

కనుక,  విష్ణు చక్రము , 16000 “ గోపికల “ తో  ( విష్ణుకాంతి  ధారలతో )చుట్టుతూ  తిరిగే  చక్రము  , అని భావించవలెను.  

విష్ణుడే  కృష్ణుడు గా అవతరించాడు. అందువలన,  శ్రీ కృష్ణుని చుట్టూ 16000 గోపీలున్నవి, అని ప్రతీతి లోకి వఛ్చినది.  అసలు విషయం , “16000 విష్ణుకాంతి  ధారాలకు మరో పేరే   , 16000 గోపికలు. “

16000 గోపికలతో,  చుట్టుతూ,  విశ్వాన్ని  నడుపు తున్నాడు , ఆ జగన్నాటక సూత్రధారియగు  శ్రీ మహా విష్ణు .

                           అన్నమయ్య  మాట 


23, అక్టోబర్ 2018, మంగళవారం

గోవర్ధనమెత్తుట

అన్నమయ్య ఎన్నో వందల సంకీర్తనలు , శ్రీ కృష్ణునిపై పాడారు.  సంకీర్తనల ద్వారా  ఎన్నో  గొప్ప గొప్ప విషయాలు తెలియజేసారు. ఎన్నో కృష్ణుని లీలలు  వర్ణిస్తూ  పాడారు.   శ్రీ  కృష్ణుడు, విష్ణు దేవుని అవత్తరమౌట వల్ల ,  విష్ణుడే అంతాయనే  భావన అన్నమయ్య పాటలలో చాలా చక్కగా కనిపిస్తుంది.
ఒక సంకీర్తనలో, విష్ణుని శ్రీ కృష్ణుని  లీలలు సమ్మేళవించి, ఎంతో  మనోహ్లాదంగా  పాడారాయన.

చిన్ని కృష్ణుడు ఆడుతూ  ఆడుతూ  మట్టి తినగా , యశోదాదేవి,  ఆ ముద్దు బాలకృష్ణుని ,  నోరుతెరిచి  చూపించమన్నది.  అద్భుతంగా, 14 భువనబాండాలు  కనిపించినవట. ఆ కృష్ణ పరమాత్మునిలోనే 
సర్వసృష్టి వున్నది, అని  ఆమెకు  తెలిసిపోయింది. 

అల్లాగే ,  తన మిత్రులతోకూడి  బాలకృష్ణుడు  ఆటలాడడానికి  పోగా, హాఠాత్త్తుగా  ఉరుములతో, మెరుపులతో , కుంభవృష్టి పడడమైంది.  అప్పుడు , శ్రీకృష్ణుడు“ గోవర్ధన పర్వతమును “ ఎత్త్తి,తన చితికినవేలుమీద  నిలిపి,  ఆ  గోపాలలులనందరిని , ఆ పర్వతముక్రిందన  బసచేయించెనట. 

ఎన్ని దినములు. ? ఒక్కటా, రెండా??  “ఏడు రోజులు ”  అలా  వర్షమాగకుండా  పడుతోనే వున్నది, 
శ్రీ గోపాల కృష్ణుడు  గోవర్ధన గిరిని  చిటికిన వేలుపై  నిలిపి, యెత్తి  నిలుచునేవున్నాడట. 
ఎటువంటి  అద్భుతమైన  సన్నివేశమిది !! ఏడురోజులు  ఒక కొండనెత్త్తి , చితికినవేలుపైనిలిపి,  నిలుచుకోవడం , ఏ  మానవమాత్రుడికైనా  సాధ్యమా??  ఒక్క  భగవంతునికే  సాధ్యము. 
ఈ  మహాద్భుత సన్నివేశాన్ని,  బాలకృష్ణుని  లీలను  అన్నమయ్య , క్రింది  సంకీర్తలో యిలాగ,  బహుచక్కగా  వర్ణించారు. 

                  “ అతి బ్రహ్మామ్డాలు  కుక్షి నటు ధరించినట్టి  ఆతనికి  చేయరో  ఆరగింపులు 

                       ప్రతిలేని  క్షీరాభ్ది  పవళించి  లేచినట్టి , చతురునికి  చేయరో  చవినారగింపులు 
పల్లవి :
వేకువ  తిరుపళచ్చి  విష్ణునికి చేయరో , ఆకటికి  ఒదగినట్టి  ఆరగింపులు —( 3, సంకీర్తన 298 )

                     “ ఏడు  దినముల దాకా   నెత్తెను  గోవర్ధనము 

                          ఆడి  వఛ్చిన  బాలునికి   ఆరగింపులు “

ఈలాంటి   భాగవత రహస్యాలనెన్నింటినో  తన  పాటలలో  నిక్షిప్తముగా  తెలిపారు , శ్రీ అన్నమాచార్య . 


                                అన్నమయ్య  మాట 



10, అక్టోబర్ 2018, బుధవారం

పరమాత్మ రూపాలు

అన్నమయ్య  “ పరమాత్మ “ నెలవున్న స్థానములు , విషయములు యివి , అని  కొన్ని ఉదహరించారు , ఒక సంకీర్తనలో . 
భగవద్గీతలో , “విభూతియోగం”లో కూడా , పరమాత్మ  నెలవున్న  స్థానములు  కొన్ని  చక్కగా 
చెప్పారు, శ్రీ కృష్ణ పరమాత్మ.  అదే   విధంగా , శ్రీ అన్నమాచార్యులవారు  కూడా,  క్రింది  సంకీర్తనలో  నిర్దాకరించి , దైవముయొక్క  నిలకడలు గూర్చి పాడారు.   
పరమాత్మ యెక్క డెక్కడున్నాడు ?  పరమాత్ముడు ఏ ఏ  రూపాలలో  ప్రకటమై  యున్నాడో , ఒక చక్కని సంకీర్తనలో  వివరించారు, అన్నమయ్య. ఈ  భూమి మీద , కొన్ని విశేష రూపాలలో వ్యక్తమై, 
 మనలకు   అందుబాటులోనే   వున్నాడు , పరమాత్ముడు.  ఈ క్రింది  సంకీర్తనలో  విశదీకరించారు అన్నమయ్య. 

             “ పట్టినవారిచేబిడ్డ  పరమాత్ముడు , బట్ట బయటి ధనము  పరమాత్ముడు 
                    పట్టపగటి  వెలుగు  పరమాత్ముడు , యెట్టనెదుటనే  ఉన్నడిదే  పరమాత్ముడు “

గట్టిగానమ్మితే  ఆ పరమాత్ముడొక  చంటిబిడ్డలా  మనతో  చేతిలోనే  ఉంటాడట.  ధర్మంగా సంపాదించిన సంపదే  పరమాత్ముడు.  “పగలున్న వెలుతురే “ , మన ఎదుటే  వున్న “వెలుతురే “
పరమాత్ముడు. 

“పచ్చ్చిపాలలోని  వెన్న  పరమాత్ముడు, పచ్చ్చినవాసిన  రూపు  పరమాత్ముడు 
బాచుచు చేతి వొరగల్లు  పరమాత్ముడు , ఇఛ్చకొలది వాడువో  యీ  పరమాత్ముడు ”

పాలలోవెన్న, ఆకు పచ్చ్చటి  రంగు , “ పరమాత్ముడు యే ”. 

                 “ పలుకులలోని  తేట   పరమాత్ముడు , ఫలియించునిందరికినీ  పరమాత్ముడు 
                    బలిమి  శ్రీ వేంకటాద్రి  పరమాత్ముడు,  ఎలిమి  జీవుల  “ప్రాణ” మీ  పరమాత్ముడు “

మాటలోని “నిజాయితీ “, సకల జీవులలో “ ప్రాణ శక్తి “  యూ పరమాత్ముని రూపాలే. 

పల్లవి  :  
భక్తి  కొలది  వాడే “ పరమాత్ముడు “,  భక్తి ముక్తి  తానే  ఇచ్చుఁ భువి  “ పరమాత్ముడు “. 

    (సంకీర్తన 410, సంపుటం 1)
ఎంత  భక్తో , అంత  చేరువగా ఉంటాడు పరమాత్ముడు . ఎంత  చేరువో  అంత  శీఘ్ర మోక్షము .  

పరమాత్ముని  విభూతి :         
                                      వెన్న , పచ్చ్చని రంగు , ప్రాణశక్తి , సత్యవాక్కు , పట్టపగటి వెలుగు ,
                                      న్యాయార్జితం , బంగారు ,  శ్రీ వేంకటేశుని కనిపించే  రూపాలు. 
పైనచెప్పినవి  పూజార్హములు.  ఎవ్వరికైనా  అందుబాటులోనున్నవే. 

దైవము  ఎక్కడో వున్నాడని,  ఎదో  అదృశ్యమని  భావించవద్దు.  ఎట్టఎదుటనే  వున్న  “ వెలుగే “
చాలుగా ... మనతోనే , మనలోనే  వున్నాడు. అతి సులభుడు,  భక్తి  గలవారికి.  హాఁ , నమ్మినవారిని 
వదలకుండా,  వెంట వెంట  తోడునీడగా  వుంటాడు . కాపాడుతాడు .. ....      


                       అన్నమయ్యమాట  

2, అక్టోబర్ 2018, మంగళవారం

అన్నమయ్య గీతార్ధం

  అన్నమయ్య , వేదోపనిషత్తులు, భగవద్గీతోపనిషత్తులను  కాచి వడపోసిన మహా జ్ఞాన ధర్మజ్ఞుడు. 
ఇన్ని వేల సంకీర్తనలను  అనర్గళంగా  పాడడం  సామాన్యులకయ్యే  పని కాదు.  భక్తి ఙ్నానా ల భావ 
సమ్మేళనం, అన్నమాచార్యులవారి ప్రతి గీతం. 

“ బ్రహ్మం  పరబ్రహ్మం ,  జ్ఞానం  జ్ఞేయం,  జీవాత్మ పరమాత్మ “ అనే  విషయాలను గూర్చి , భగవద్గీతలో ని  సంస్కృతభాషనుండి ,  తెలుగుభాషలో సంకీర్తన రూపంలో వివరించి , ఈ లాగ  పాడారు. వేదాలు చెప్పిందీ ఇదే , అని  గెంతుతూ డేం డేం అని అరుస్తూ చెప్తున్నారు. 

“ఓహో డేం డేం ఒగి  బ్రహ్మమిదియని , సాహసమున  శృతి చాటెడిది “. (396, సంపుటం )

                “     పరము  దేవుడును ,  అపరము  జీవుడు 
                      తిరమైన  ప్రక్రుతి యే  దేహము “

“జ్ఞానము  జ్ఞేయము  జ్ఞానగమ్యమున , పూని తెలియుటే  యోగము 
జ్ఞానము  దేహాత్మ , జ్ఞేయము పరమాత్మ , జ్ఞానగమ్యమే  సాధించు మనసు “

మనస్సును  నిగ్రహించి, ఈజీవాత్ముడు,  జ్ఞానమార్గంలో , జ్ఞానంతో  జ్ఞానగమ్యమైన  పరమాత్మను  తెలిసికొనుటయే  నిజమైన  యోగం , అని అన్నమయ్య భావం. అదే , భగవద్గీతలోని  క్షేత్ర క్షేత్రజ్ఞ     విభాగయోగంలో  చెప్పియున్నది యిలా. .........   

       “    జ్యోతిషామపి  తత్జ్యోతిహి  తమసః  పరముచ్యతే 
              జ్ఞానం  జ్ఞేయం  జ్ఞానగమ్యం  హృది  సర్వస్య విష్టితం  “   

ఏ  వెలుగు సృష్ఠి యంతయూ  వ్యాపించియుండి, ఏ తన ప్రకాశముతో  చీకటిని పారద్రోలుచున్నదో , 
అదియే,   “ పరము “ అని పిల్వబడుచున్నది. ఆ వెలుగే  జ్ఞానరూపం. ఆ వెలుగే  దైవరూపం  . ఆ వెలుగే హృదయంలో నున్న “మనసు “. అంటే , మనస్సే  సర్వవ్యాపియైన  పరమాత్మ .   

ఈ  శరీరం సహాయంతో,  ఆ పరమాత్ముని  తెలిసికోవడమే  జన్మసార్థకత .   
                           
మనసే మనస్సును తెలియగలదు . అదే  వేదాంత రహస్యం. 
అదే అన్నమయ్య సంకీర్తన గీతాబోధ. 

            అన్నమయ్య మాట 
   
                      



8, సెప్టెంబర్ 2018, శనివారం

వేదాంతరహస్యం, నెంబర్9

    అన్నమయ్య  గుప్తంగా చెప్పిన గొప్ప విషయాలు అనేకములు. వాటిలో నిగూఢంగా  స్పిరిట్యువల్ కాస్మొలజి    యెంతో  చెప్పివున్నారు . ఇక్కడ చూడండి , ఏమి   చెప్పారో        

                    “ మూడే మాటలు, మూడు మూండ్లు తొమ్మిది ( 2, సంకీర్తన 23)
                       వేడుకొని  చదివరో  వేదాంత రహస్యము “

వేదాంతరహస్యం :
                                 “ తత్వమసి “ అని  దైవమునకు  నిర్వచనం. అంటే,  “ అది నీవై వున్నావు “ అని    
                                   అర్థము ..  ఇది గొప్ప ఉపనిuషద్ వాక్యము. ఆ “అది “ ఏమిటంటే, “        
                                    విశ్వాత్మ లోని  “ మనస్సు “.
మూడుమాటలు:                                     తత్ + త్వం +ఆసి = తత్వమసి.
                                                                తత్వమసియే  ఆత్మ, పరమాత్మ.
                                                       విశ్వమంతా వ్యాపించుచున్న అద్భుత ఆకర్షణ క్షే త్రం, క్షేత్రజ్ఞుడు.

                                                         తత్+ త్వం+ ఆసి , అను మూడుమాటలే మొత్తం వేదాంతసారం.

మూడు మూళ్ళ తొమ్మిది :           3*3=9.    ఈ లెక్క అందరికీ తెలిసినదేగదా.  “ 9 సంఖ్య “ చాలా విశేష .
                                               ప్రాధాన్యమున్న సంఖ్య. అందరూ ఆలోచించవలసిన విషయమిది. 
                                             ఏ రకంగా  సంఖ్య   3 విశేషమో, అల్లాగే  సంఖ్య 9 కూడా చాలా చాలా 
                                            విశేషమైనది.
 అన్నమయ్య,  యీ పాటలో ఒక సూచనపప్రాయముగా , సంఖ్య 9 గూర్చి,  “తత్వమసి “ అను వేదాంత
రహస్యము గూర్చి మనకు తెలియజేసారు.  విస్లేశించిచూడాలి. ఎన్నో  రహస్యాలు తెలియగలవు.

         అన్నమయ్య మాట

31, ఆగస్టు 2018, శుక్రవారం

జననమరణములు

అన్నమయ్య  మహా జ్ఞాని. ఆయన  వేదోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను  అవపోసనపట్టిన వేదాంతి. స్వయం విష్ణ్వామ్స సంభూతుడు. ఈ  భూమిమీద పుట్టిన ప్రతి జీవికి సుఖదుఃఖములు , కష్టసుఖములు, జనన మరణములు ,ఆసా పాశములు తప్పవు, ఎవ్వరు తప్పించుకోలేరు అని నొక్కి చెప్పిన మహా ఆచార్యులు, అన్నమయ్య. ఏ  జాతివారికైనా , ఏ దేశమువారికైనా సంసారయోగము ఒక్కటే. ఒక్కటే.
అది ఏమిటో  అంటే , ఇది అని, క్రింది మాటలలో చెప్తున్నారు.

                      పుట్టినవానికెల్లా భువి మరణము నిత్యము,
                        అట్టే  చఛ్చినవారికి  అవ్వల జననము

భూమిమీద  జన్మమెత్తిన  వారెవ్వరైనా  గిట్టక తప్పదు.  ఇది అపర సత్యము. సృష్టి నియమము.

భగవద్గీత లో   “ జాతస్యహి ధ్రువో మృత్యుహు, ధృవం జన్మ మృతస్యచ “  అని చెప్పబడినది.
పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు, పోయిన ప్రతి జీవి పుట్టక తప్పదు. ఈ, ఈ  నిజం తెలిసి  జీవించడమే
ఒక కళ . 
జీవుడు ఎన్నో జన్మల చక్రంలో పరిభ్రమించుతూవుంటాడు. మనము దుస్తులు మార్చినట్లే  ఒక్కొక్క జన్మలో,  ఒక్కొక్క  రూపధారణ చేయడం జరుగుతుంది. ఈ చక్రభ్రమణం నుండి  తప్పించుకోడానికి మార్గం ఏమిటంటే, ధర్మబద్ధమైన  పనులు  చేస్తూ జీవించడమే. ఇదే వివేకవంతమైన  జీవితము.

మనముందున్నదంతా  దైవీకమైనదని,  సర్వమూ  దేవదత్తమని , మనము  నిమిత్తమాత్రులమని,  తెలిసి
యీ  అరుదైన  మానవ జన్మని జాగ్రత్తగా, ధర్మబద్ధంగా  గడపడమే, “ సంసారయోగము “ అని చెప్తున్నారు, అన్నమయ్య.

జీవుడు నిత్యుడు  ఏమిటా చెరుపగరానివాడు
ఈ వివేకము  తెలిసి  ఏ  జాతివారైనా
దైవీకమే  నమ్మి  తమ ధర్మములబాయరాదు
సావధానమిదియే  సంసార యోగము 

జనన  మరణముల నడుమనున్న  జీవిత కాలమును సత్యమార్గములో ,  ధర్మమార్గములో  నడపమని,
అన్నమయ్య   సావధానం చేస్తున్నారు. పుట్టుట పోవుట చాలా చేదు నిజము.  కానీ  ఒప్పక తప్పదు గదా !


                      అన్నమయ్య మాట 

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...