30, జూన్ 2018, శనివారం

చైతన్యము, జ్ఞానము

  పరమాత్ముడు సర్వాంతర్యామి.  మన దేహము లోన, దేహము  వెలుపల , ఎక్కడ చూచినా  అక్కడ నెలవైయున్నాడు.  మన దేహములో  మనస్సు రూపంలో, హృదయం లో  నెలవై వున్నాడు. అంతే  కాదు,

“ చైతన్య రూపంలో “ నిలిచి,  ఎన్నో పనులు చేయిస్తున్నాడు,  “ జ్ఞానమై “ మన  బుద్ధిని  సంఛాలన చేయిస్తున్నాడు, అని,   అన్నమయ్య కొన్ని సంకీర్తనలతో చక్కగా వివరించారు.
 మనలోన  “ అంతరాత్మ యై ” ( మనస్సు  ) , బుద్ధి జ్ఞాన చైతన్యము ల సమ్మేళనముతో ,  కర్మ కార్యములను మనతో  చేయిస్తున్నాడట. ఈ ఈ  రూపాలలో  వున్నాడు , మన లోపల వెలుపల , అంటూ , క్రింది సంకీర్తనములలో ఎంతో  బాగా  చెప్పారు , అన్నమయ్య.

                       “సతతము జీవులకు  చైతన్య సూత్రము
                         అతిశయ భక్తుల జ్ఞానామృతము “
“ఈ రూపమైయున్నాడు  ఈతడే పరబ్రహ్మము
అదే పంచ భూతాలుండే  అశ్వద్ధము “.        (3, సంకీర్తన 244)

                             “  నారాయణుడే  సర్వనాయకుడు
         చైతన్య మీతనిది,  సృష్టి యీతని  ఘటన
         ఆత్తుమ,  శ్రీ వేంకటేశుడు  అంతర్యామి “.         ( 3, సంకీర్తనం 264 ).

             “          “చిత్తములో  విజ్ఞానము  శ్రీ వెంకటేశా నీవే  “
మనస్సులోని   జ్ఞానవిజ్ఞానములు   వేంకటేశ్వరుని  మరోరూపములు, అని అన్నమయ్య  భావము.


ఏ   సర్వాంతర్యామి  సృష్టి అంతయు వ్యాపించియున్నాడో, ఏ విశ్వాత్మ  సృష్టి కారకుడో,  ఆతడే  మొత్తం  ప్రాణులలో అంతరాత్మయి, మనస్సు లాగ  ,” చైతన్యము ”లాగ , బుద్ధి జ్ఞానము లతో కూడి , అనేకమైన పనులు చేయిస్తున్నాడు.  దైవము కనిపించని యట్ఠే ,” చైతన్యము” కూడా కనిపించదు
అని అన్నమయ్య వాక్కు.       భగవద్ గీతలోనూ  ఇదే  విషయమిలాగ  చెప్పబడింది.

“ సర్వస్యాచాహం  హృది సన్నివిష్టాహ , మత్తహ స్మృతిర్ జ్ఞాన మాపోహనమ్ “
ఎప్పుడూ హృదయందగ్గరగా ఉంటూ,  నేను బుద్ధి ఙ్ఞానం  మరుపు  రూపాలలో వుంటాను, చైతన్యమై ..



                             అన్నమయ్య మాట



27, జూన్ 2018, బుధవారం

చిత్తము : మనస్సు

 అన్నమయ్య  తన సంకీర్తనలతో,  ఎన్నోమార్లు,  తన మనస్సును ఉద్దేశించి చాలా వేదాంతం  చెప్తాడు.
మనస్సుకు  మరో  పేరు చిత్తము.  మనస్సు “ అంటే????  ఈ మనస్సు, రూపం ఏంటి ?
తనువులోపల,  పరమాత్ముని, కనిపించని   ఒక  విభిన్నరూపం. మనస్సు.
ఎలాగ,  ఐదు జ్ఞానేంద్రియాలు , అనుభవానికి మాత్రమే తెలుస్తున్నాయో,  అల్లాగే మనస్సు కూడా స్వానుభవవేద్యం. మనస్సు “ఆరవ ఇంద్రియం”.  “ మనః సష్టానీన్ద్రియాని ప్రక్రుతీస్తాని కర్షతి “  అని భగవద్ గీత లో చెప్పబడినదే , అన్నమయ్య పాటలో చెప్తున్నారు.
“ చిత్తమెప్పుడు  సత్యాన్ని  చెప్తుంది.

విశ్వఅంతరాళాలలో  వ్యాపించిఉన్న,  పరంజ్యోతి తో కూడిన  మనస్సు యే ,  విశ్వాత్ముడు , పరమాత్ముడు,  ప్రకాశాత్ముడు... అందుకే,  దైవము  సర్వము యెరుగును.  “ సర్వ సాక్షి “.
పరంజ్యోతి లోని  మనస్సు యే  పరమాత్ముడు, సర్వాత్ముడు, అంతరాత్ముడు అని, వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాము. దేహము లోపల,  దేహము వెలుపల, కండ్లకు కనిపించని,  అనుభవానికి మాత్రమే అందే , అద్భుత అంతరాత్మయే,  చిత్తము.     హాఁ ,  చిత్తము, మన దేహములో  నిలిచియున్న  దైవము.
అన్ని రకాల  భావాలూ ,  మనస్సునుండే  జనిస్తాయి.
ఈ  “ చిత్తము “ స్ధానము “ హృదయము “ నకు చేరువగా నుండు .. ఈవిషయం గూర్చి అన్నమయ్య క్రింది  పాటలలో, ఇలా ముచ్చట గా  చెప్పారు.

         “ హృదయము లోపల దేవుడుండగా ,  ఎరుగక భ్రమయించుదు  “.    (   3, సంకీర్తన 85 ).

                  “ చిత్తము లోపల నున్న “ చింతామణి “ యీ  హరి “.      (3 వ సంపుటం, 196సంకీర్తన ).
చింతామణి  అంటే,  కాంతులువేదజల్లే మాణిక్యం అని అర్ధం. చింతలు అంటే ఆలోచనలు . ఆలోచనలు “మనస్సు నుండి పుడతాయి.   “చింతామణి “అంటే,  ఆలోచనలనే  కాంతులు వెదజల్లే మాణిక్యము వంటి మనస్సు యగు ఆ దైవము అని అన్నమయ్య అర్ధము.

            “   ఎదలో  నుండుదువని  ఇన్ని వేదాలు  చెప్పగా “ (.  3, సంకీర్తన 210 )

హృదయంలోనే  దేవుడున్నాడని, వేదాలలో, భగవద్ గీతలోనూ చెప్పబడిఉంది.
   
                 “సర్వస్స్యచాహం  హృది సన్నివిష్ఠహ ” అని గీత లో  పురోషత్తమప్రాప్తి యోగంలో , చెప్పి ఉన్నది.

అందరిలో, అన్ని ప్రాణులలోను, దైవము “ మనస్సు “ గ,  భావోద్భవకరుడుగ  నెలవై వున్నాడని  అర్ధము.
వేదాలు, పలు పురాణాలు,  బ్రహ్మ సూత్రాలు,  భగవద్గీత , ఉపనిషత్తులు , ఇంకాఎన్నోధర్మ శాస్త్రాలు చదివి ,
అవపోసనపట్టిన,  అన్నమయ్య  పాట మాట  కూడా అదే చెప్తోంది.  ..   
“ మనస్సే “. దైవం.    హృదయంలో  అది నిలయం అని.

                     అన్నమయ్య  మాట



పాపపుణ్యములు

  భారత దేశంలో,  ప్రతి ఒక్కరికి తెలిసిన పదాలు , పాపపుణ్యములు. చిన్నపిల్లవాడికి కూడా , కొంత అవగాహన వున్న పదాలివి. చెడ్డ పనులు  చేస్తే పాపం వస్తుంది, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది ,
అని, పెద్దలు , చిన్నతనం నుండి నేర్పే సంప్రదాయం ,  హిందూ ధర్మము లో నిండి ఉంది.
అలాంటి, హిందూ ధర్మం గూర్చి,  ప్రభోదాత్మకం గ,  ఎన్నో సంకీర్తనలు పాడారు, అన్నమయ్య.

                    “ పాప పుణ్యముల పక్వమెరుంగను,  నా పాలిటి హరి నమో నమో “

ఏది పాపం, ఏది పుణ్యం? మనం చేసే కర్మ ఫలితాలే చెప్తాయి.  మన కర్మఫలం మనతోనే ఉంటుందని,  వేద వాక్కు.  “ విద్యుత్ ఛార్జ్ “ రూపంలో, మనస్సులో, మనస్సు తో,  కూడి ఉంటుంది. ఈ, ఈజన్మ   పాపపుణ్యాలు మాత్రమే కాదు, ముందటి జన్మలవి గూడా , జీవి మనస్సుతో వదలక,  పూవులోని తావి వలె,
ఉంటాయి. చేసేటి కర్మలు, పాప పుణ్యాలను నిర్ణయిస్తాయి. ముందు చేసిన  పాపపుణ్యములు , చేయబోవు కర్మలను నిర్ణయిస్తాయి. ఇదియే  “ధర్మ సత్యం “,  అదియే అన్నమయ్య భావము.

     “పాపము, పుణ్యము పరకట నున్నది. చే పట్టుము నీ  చేతి  దీ ప్రాణి “ (394, సంపుటం 3).



      “ నాలుక  కొనలనే  నానుచు నున్నది, కాలపు నిజమును కల్లయును
      వాలుచును  తాసువలె  నున్నదిదే , తాలిమి ధర్మా ధర్మములు “
   
ధర్మ బద్దమైన విషయాలన్నీ నిజాలు,  ధర్మవిరుద్ధమైనవన్నీ  అబద్ధాలు.


ధర్మానుగుణం గా చేసిన పనులు పుణ్యాన్ని ఇస్తాయి. ధర్మావగుణం గ చేసిన పనులు పాపాన్ని  ఇస్తాయి.
అందుకని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా , ధర్మాన్ని అనుసరించుతూ ఏ పనైనా చేయాలి గదా.?
పుణ్యమైన పనులు మాత్రమే,  పరమాత్మకు చేరువ చేస్తాయి. నాలుక కొననే, హరి నామముండాలి.
అప్పుడు ఆ వేంకటేశుడు,  మన చేయి పట్టి , జీవితాన్ని నడిపిస్తాడు. దైవ బలం ఉంటే , ఇంకేమి తక్కువ??

ధర్మాధర్మములు,  నిజానిజములు,  పుణ్యాపుణ్యములు,  పగలు రాత్రి వంటివి.
ఈ అపర సత్యాన్ని ఎరిగి , దైవభక్తి మరవక,  జీవించమంటారు, అన్నమయ్య.  గొప్ప వేదాంతి.

                          అన్నమయ్య మాట





25, జూన్ 2018, సోమవారం

దైవభక్తి మహిమ

           “ భక్తి  నీపై  అదొకటే  పరమసుఖము.      
               యుక్తి చూచిన  నిజంబొక్కటి  లేదు “

ఈ ప్రపంచంలో,  ఒక్క దైవ భక్తే  అమిత సుఖాన్ని  ఇస్తుంది.  తక్కినవేవైనా  అంత హాయిని ఈయవు.  అన్ని
ప్రాపంచిక విషయాలు,   చివరగా   దుఃఖాన్నే  కలిగిస్తాయి.  భక్తి తప్పించి అన్నీ విషయాలు  విషాలే .
అన్నీ అసత్యాలే.    ......... అంటాడు అన్నమయ్య, ఈ సంకీర్తనలో.  ( 3, సంకీర్తన 322 )

         “ ధనమెంత గలిగినా దట్టమౌ  లోభంబు, మొనయు చక్కదనంబు  మోహములు  రేచు
               ఘనవిద్య గలిగినను  కప్పు పై పై  మదము, ఎనయగా పరమపదము యించుకయు  లేదు. “

 సంపద  ఎక్కువైయ్యేకొద్దీ  పిసినాసి తనము,  అందమెక్కువగా ఉండేకొద్దీ మోహభావము,  ఎక్కువైన జ్ఞానంతో  కళ్ళు కప్పే మదము,  వస్తాయి.  అంతేగానీ,  ఏ రకంగానూ  మంచి చేయదు. ఒక్క దైవ భక్తే ,
పెరిగే  కొద్దీ  ఆనందాన్నీ , మోక్షమార్గాన్నీ  చూపేది. ఏదీ లేదని చింతిచనక్కర్లేదు.  దైవభక్తి ఉంటే చాలు.
తక్కినవి అన్నీ ఇచ్చెంత ఆనందాన్ని ఇస్తుంది.  అసత్యమైన, అశాశ్వతమైన, దుఃఖకారణమైన  ప్రాపంచిక విషయాలకు, ఎంత విలువ ఇవ్వాలో తెలిసి జీవించడమే, జ్ఞాని లక్షణము, అంటారన్నమయ్య.

              “ సిరులెన్ని  కలిగినను  చింతలే  పెరుగు,
                  ఇరవైనా శ్రీ వెంకటేశా నిను కొలువగా , పెరిగే నానందము బెళుకులిక  లేవు “


అధికమైన ధనం వల్ల అన్నీ  ఇబ్బందులే,   అన్నీ చింతలే.   అదే, అధికమైన భక్తి తో వెంకటేశుని పూజించితే,  ఆనందమే ఆనందం.  పైగా వేంకటేశుని కటాక్షము. తోడు. అండ. ప్రేమ. ఆత్మ ధైర్యం.
భక్తి తప్పించి,  యింక ఎక్కువగా ఎమున్నా  చిరాకులే, చింతలే.
అందుకనీ,  దైవ భక్తి మహిమ తెలిసి, జాగరూకులై,  ప్రపంచ చింతలనుండి,  సావధానంగా ఉండమని,
అన్నమయ్య  మనలను  హెచ్చరిస్తున్నారు.

                               అన్నమయ్య మాట

భక్తి ముక్తి

    అన్నమయ్య  ఆధ్యాత్మికత యే , ఆతని విష్ణు భక్తికి కారణం. భక్తి అంటే అకుంఠిత విశ్వాసము. భక్తి , ఒక పవిత్ర  మనో భావము. భావములన్నింటికీ మూలం” మనస్సు ”.  మనస్సు  ఎంత  శుద్ధమో, భావము అంత శుద్ధము.  నిర్మలమైన భక్తి భావమే,  దైవానుగ్రహానికి కావలసిన సాధనం.      ఎన్ని ఇబ్బందులున్నా,  ఎన్నికష్టాలు వఛ్చినా, అన్నిటినుండి  కాపాడేందుకు  దేవుడున్నాడనే  భావమే “దైవ  భక్తి “. అదియే  నిజమైన ఆధ్యాత్మికత.  ఎంత  భక్తో, అంత ఫలము.  ఈ విషయం గూర్చి, అన్నమయ్య చాలాసంకీర్తనలలో
ప్రస్తుతిన్చాడు. . 
                              “ భక్తి కొలది వాడే  పరమాత్ముఁడు 
                                   భుక్తి ముక్తి తానే యిచ్చు, భువి పరమాత్ముడు “ ( 410, సంపుటం). 
ఈ భువిలో, భుక్తి , మోక్షము , రెండు ఆపరమాత్ముడే అంటే ఆ దైవమే  యిస్తాడు.  
ఎవరి భక్తి  కొద్దీ వారికి  ఫలం. భక్తి భావము పెంచుకోవాలి అని గదా అర్ధం ? ఎలా? కొన్ని  రకాల  సాధనలతో , దైవ భక్తి  పెంచుకొని, ఆత్మ శుద్ధి చేసుకొని వచ్చు.  అవి , పూజనము , ధ్యానము , జపము, తపము, గానము, దానము , హరిదాస సేవనము, సంకీర్తనము  , మొదలైనవి.  
పైన చెప్పిన మార్గములలో, ఏదైనా ఒక మార్గం  , మనస్సును పవిత్రం చేసి, ఆ దైవము పై  నిశ్చల భక్తి ని 
కల్గించగలదు. భక్తితో ,
                                  “ కొలిచిన వారల కొంగు పైడితడు 
                                        బలిమి తారక మంత్ర మీతడు. “

భక్తి  యొక్క  శక్తి  ఎంతంటే,  వేంకటేశుడు భక్తుల కొంగు బంగారం ఔతాడట. దేవుడు, తన భక్తుల వెంటే ఉంటాడు.”  కొంగు “ పట్టుకొని, భక్తుడితోనే తిరుగుతాడట.  
భక్తి భావమే,  సులభ మార్గమ్  , మోక్ష సాధనకు......... అంటాడు.      

                            అన్నమయ్య మాట 



24, జూన్ 2018, ఆదివారం

జీవాత్మ

   అన్నమయ్య ,            “ జీవాతుమై  ఉండు చిలుకా,   నీ
                                  వావలి  పరమాత్ముడై ఉండు చిలుకా “.       (. సంకీర్తన 50,  సంపుటం 1) అన్నాడు.  

దేహములోపల  ప్రకృతితో బంధింపబడిన పరమాత్మయే , “జీవాత్మ”.

దేహములోని ఆత్మ,  దేహము వెలుపల పరమాత్మ. . .  ప్రకృతి లోని, త్రిగుణాలు , పంచభూతములు, మనస్సుతో కూడి, దేహాత్మ యగును. దేహములోని జీవాత్మనే, దేహాత్మ అని కూడా పిలిచాడు, అన్నమయ్య.


                          “పరము దేవుడును,  అపరము  జీవుడు

                             తిరమైన ప్రకృతియే  దేహము “.               ( 396పాట , సంపుటం 1)kk
  “ జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ
     జ్ఞాన గమ్యమే  సాధించు మనస్సు. “

దేహాత్మకు, పరమాత్మకు  గల  ఒకే  సమాన గుణమేమిటంటే,  “ మనస్సు “.. 
దేహంలోని  మనస్సు  పూర్తిగా  శుభ్రమైనప్పుడే, బయటున్న పరమాత్మ  “మనస్సు “తో, అనుసంధానము కాగలదు.  జ్ఞానమొక్కటే , మనలోని మనస్సును  శుభ్రపరచే   “డిటర్జెంట్ “. 
ఇదే విషయం , భగవద్ గీతలో , క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగంలో  ,   క్రింది  శ్లోకంలో  చెప్పబడినది. 

                  “   జ్యోతిషామ్  అపి  తత్  జ్యోతిహి , తమసః  పరం  ఉచ్యతే 
                        జ్ఞానం  జ్ఞేయం  జ్ఞాన గమ్యం  , హృది  సర్వస్య  విష్ఠితం “   

దేహములోని జీవి,  లేక జీవాత్ముడు,  మనస్సును సాధనంగా ఉపయోగించుకొని , ఆ పరమాత్మను గూర్చి

తెలిసికొన గలరు. అశాశ్వతమైనది జీవాత్మ, శాశ్వత మైనది పరమాత్మ. ఒకటి క్షరము, మరొకటి అక్షరము..

జీవుడు ఎన్నో జన్మలలో , ఎన్నో శరీరాలను ధరించి, రకరకాల కార్యాలు చేసి,  కాలం గడుపును.  

ప్రకృతి  ప్రభావం వలన జీవాత్మ , ఎన్నెన్నో పనులు చేసి, పాప పుణ్యాలను గదించడం జరుగుతుంది.
పాప పుణ్యాలు, కేవలం జీవాత్మకు వర్తిస్తాయి.  పరమాత్మ  సర్వ పావనుడు. సర్వ పరిపూర్ణుడు.

“ఎవ్వరెవ్వరివాడో ఈ జీవుడు   ఎవ్వరికి  ఏమొవ్నో  యీ జీవుడు. ( 97వ పాట , సంపుటం 1)“

అనే సంకీర్తనలో, అన్నమయ్య  ఇలాగ చెప్పారు. ఒక జన్మలో కొడుకుగ  , ఇంకొక జన్మలో తోబుట్టుగ  ,  ఇలా రకరకాల చుట్టరికాలతో,  ఎక్కడెక్కడో పుట్టి , ఎన్నెన్నో శరీరాలు మోసి, సుఖ దుఃఖాలతో , తిరుగుతూ ఉంటాడు జీవుడు. అంటే జీవాత్మ.

ఎప్పుడు ఈ “ పునర్జన్మ చక్రభ్రమణం”  నుండి  బయటపడతాడో, ఎవ్వరికి తెలియదు.


             “దేవుడు కారణము తెలిసినవారికెల్లా , జీవుడు కారణము చిల్లర మనుజులకు

                         దేవుడు వేరే కాడు , దిక్కు శ్రీ వేంకటేశుడే .... (471, సంపుటం) “

దేవుడైన  శ్రీ వెంకటేశుడే కారణం, ఒక మనిషి పుట్టుగుకు.

దేవుడు విశ్వాత్ముడు,  జీవుడు దేహాత్ముడు. .

“.       “హిందూమతము  “పునర్జన్మ సిద్ధాంతం “ మీద నిలబడిన “ధర్మము ”.  

          హిందూమతము   “జీవాత్మ  పరమాత్మల  అనుబంధమౌ  “ కర్మ బద్ధ సిద్ధాంతము. “. “.

                                       అన్నమయ్యమాట





23, జూన్ 2018, శనివారం

ఆత్మ, పరమాత్మ

 ,  ఆత్మ , పరమాత్మ  అనే రెండు శబ్దాలు. అన్నమయ్య సంకీర్తనలలో, విపరీతంగా వినిపిస్తాయి.
సామాన్యంగా  ఆత్మఅంటే, దెయ్యం అనే ఒక తప్పు అర్ధంతో , ప్రతీతిలోఉంది. అది తప్పు అర్ధం.
 ఆత్మ అంటే ఏమిటో, అన్నమయ్య ఈ సంకీర్తనలతో చెప్పాడు.

            “ చై తన్య మీతనిది , సృష్టి ఈతని ఘటన
                 ఆతుమ శ్రీ వేంకటేశుడు అంతర్యామి “

ఏ దైవీఁక శక్తి , సృష్టియంతా నిండి వున్నదో, ఆ అంతర్యామియే  “ ఆత్మ “. అదియే  వేంకటేశుడు. అదియే
నారాయణుడు.  అదియే విష్ణువు. తానే  చైతన్యము.  తానె, యీ సృష్టికి మూలము.

                  “ ఆతని మూలమే జగమంతా . ఆతుమ లోh హరి కీలు యయి వుండు గాని “

ఈ జగమంతా నిండి ఉన్న ఆత్మ లోని కీలక ధాతు హరియే.  “ విష్ణు డొక్కడే విశ్వాత్మకుడు “.
విష్షుడే  ”పరమాత్మ “.  “ వైష్ణవమే  సర్వంబు “.
   
                      “ అదియే విష్ణు పదము , ఆతుమకు  నెలవు “
                           అదే జనన కారణము , ఆకాశ పదము “..  ( 2, సంకీర్తన 402 )

విష్ణువే  ఆత్మ.  విష్ణువే పరమాత్మ. . “ విష్ణువే అంతా యని  భావించుటే బుద్ధి “.

“పరమాత్ముడవు నీవు, పరం జ్యోతివి “ అన్నాడు అన్నమయ్య.
పరమాత్మ రూపం  “వెలుగే “. విశ్వమంతా  కనిపించకుండా వ్యాపించియున్న  “దివ్య జ్యోతియే “ పరమాత్మ.

“ ఇలా పంచ భూతములలో గుణములు,  అల నవగ్రహ విహారంబులు
  తలకొను  కాలత్రయ ధర్మంబును , అలరగా నారాయణుని మహిమలే “. (  2, సంకీర్తన 345 )

భూమి, ఆకాశము, అగ్ని, వాయు, జలము “ అనే పంచభూతములలో ,  అంతరిక్షంలోని గ్రహాలలో , మూడు కాలాలలో, అన్నింటిలో, అన్నిచోట్లా , అదృశ్యముగా  అలరించే “ మనస్సు “ యే  హరి.
“ మనస్సు లోనే మాధవు డున్నాడు. “.   (  4, సంకీర్తనం 261. )
అన్నీ ఆత్మలోనే, అన్నిటిలోను పరమాత్మయే. ఇది, ఆత్మ, పరమాత్మ తత్వము.

ఆత్మ,   విశ్వమంతా వ్యాపించివున్న  “ ఆకర్షణ క్షేత్రమైతే”,   పరమాత్మ “ క్షేత్రజ్ఞుడు “.
 ఆ క్షేత్ర క్షేత్రజ్ఞుడు ” “విష్ణువు “. ఆతడే నారాయణుడు. ఆతడే హరి. ఆతడే వేంకటేశుడు.

                      అన్నమయ్య మాట




22, జూన్ 2018, శుక్రవారం

దేవుడు

 అన్నమయ్య  గొప్ప  విష్ణు భక్తుడు.  మహా వేదాంతి.  15 వ శతాబ్ది లో వుండిన మహా  కవి, మహా వెంకటేశ  భక్త శిఖామణి.
పదకవితా పితామహుడు.  మహా వేదాంతి అయిన  అన్నమయ్య,  కొన్ని వేల సంకీర్తనలతో,  హిందూమత 
వేదాంతాన్ని ,  ప్రపంచానికి అందజేశాడు..  దేవుని కటాక్షముండబట్టే , అంత చక్కగా హిందూ వేదాంతాన్ని 
తక్కువ పదాలతో , విశదంగా , వివరించగల్గాడు. 
దేవుడంటే  ఏంటి??  దేవుని కటాక్ష మెలా సాధ్యం ?అలా, అలా ఎన్నో చెప్పాడు.

దేవుడంటే:::::::::: ఏ అద్భుత  ఏకైక మహత్తర రూపం, ఎందులో అన్ని, అన్నీ, అన్నీ, అన్నీ  శక్తి రూపాలు  చేరి, కూడి ఉన్నవో, ఏ రూపం ఎక్కడ చూచినా అక్కడ విశ్వాఅంతరాళాలలో వ్యాపించి వున్నదో,  ప్రతి వస్తువులో వున్నదో , ( చరాచరములందు , స్థిత్యాస్థిత్యములందు, జ్జీవాజీవములందు వున్నదో ), అట్టి
“ సర్వాంతర్యామి “యే  “  దైవము “.  దేవుడు దేవుడు అని అంటాము. ఈ విషయాన్ని,  క్రింది సంకీర్తనలతో  చక్కగా వివరించాడు, అన్నమయ్య. ........mm

         “ దేవుడొక్కడే  గురితెలిసినవారికి “ , ఒకే ఒక్క , వొక్క టే రూపం దేవుడికి , విశ్వసించినవారికిది తెలుస్తుంది. మరి, ఆ ఒక్క  రూపానికి గల గుణాలేవి?  ఇవి......... (సంపుటం 4, సంకీర్తన 356 )

             “ పరమాత్ముడవు నీవు,  పరం జ్యోతివి నీవే.
                  ఇరావుగా కంటి వింటి నీరూపం “.

అన్నమయ్య దైవమైన వేంకటేశుని రూపం ,  “ పరం జ్యోతి “ యే . అంటే , అద్భుతమైన తేజస్సు,  వెలుగు.
అన్నమయ్య ఆ “దివ్యమైన వెలుగు”ను చూచా నాని గట్టిగా చెప్తున్నాడు.
పరమాత్ముడు అని పిలువబడే దేవుని రూపం ” దివ్యకాంతి.

           “ వెదక జీవులలోనే వేవేల రూపాలు , అదే” విశ్వతోముఖా అనంత మూర్తి “.
                ఇదే శృతి  వొగడీనీ , యిదివో నీ రూపం “

 ఎన్ని ప్రాణులున్నవో  , అన్నింటిలోనూ , దేవుడు  కాంతి రూపంలోనే వున్నాడు.     విశ్వమంతా అన్ని రూపాలలోనున్న ఏకైక తేజో రూపం.  వేదాలలో కూడా యీలాగే వర్ణింపబడింది.

                   “ ఎందును  శ్రీ వేంకటేశ   “ “ఏకో నారాయణ”, ఇందులో శ్రుతి చాటేనిదివో   నీ రూపం “
 
“ఒక్కడే నారాయణుడు. ”  నారాయణుడే  వేంకటేశుడు.  ఎందులో  చూచినా  అందులోన వుండే ,
            ఒక “పరం జ్యోతి “, ఒక “ అద్భుత దివ్య తేజస్సు “యే
                  దేవుడు.

                 అన్నమయ్య మాట.



       



గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...