19, జులై 2018, గురువారం

అన్నమయ్యతత్వం

 అన్నమయ్య  వేదాంతమెంతసరళమో, తత్వ జ్ఞానమూ అంత సులభము.
సకల వేదాంత సారాలు కాచి వడబోసి, “పరతత్వము “ అంటే ఏమిటో, పర తత్వ సాధనమెలాగో , మనకు చాలా సరళమైన రీతిలో, పాడి తెలిపారు , శ్రీ విష్ణు అన్నమయ్య.   “ శ్రీ  విష్ణు “ ఆయనకు  బిరుదు.  ఎందుకంటే , అన్నమయ్య  విష్ణుతత్వవేది.  వైష్ణవమే తన  “ పరతత్వం “.  
తత్వమసి “ అనే  పరతత్వ నిర్వచనమునకు   అర్ధము “ విష్ణువు “,  అని తెలిసిన  పరతత్వవేది , అన్నమయ్య. 
తత్ + త్వం + అసి = తత్వమసి .  అంటే ,” అది నీవుగ వున్నావు “.. అని అర్ధము. 
“అది ”  అని , “ఆత్మ ” ను  ఉద్దేశిస్తున్నారు.  సర్వాంతర్యామియైన  “ఆత్మ స్వరూపము ” విష్ణువేనని,  ఈక్రింది సంకీర్తనలో  చెప్తున్నారు, అన్నమయ్య. 

          “ తగిలి చూచిన  “ ఆత్మ “  తను కానరాదుగానీ, జగమెల్ల  తానైతే  సరిగనీని 
               చిగురెంత , చేగెంత , శ్రీపతి యిందులో , నీ “పగటు”  తెలియు వాడే , “పరతత్వవేది “

ఎంత వెదికినా కనపడని ఆత్మ ,లోకమంతా చూస్తూ ,లోకమంతా నిండియున్నది. ఆ  ఆత్మ విష్ణువే . 
విష్ణువు యొక్క  “వెలుగు “ చూచినవాడే  పరతత్వము తెలిసిన  “ పరతత్వవేది.”   “
పగటు” ,  అనే శబ్దాన్ని,   “వెలుగు “ అనే భావంతో  ప్రయోగించారు, అన్నమయ్య.     

               “ పొలసి  మసకమందు  పొడమేటి  జీవుని  తలపు , బ్రహ్మాన్దాలు  దాటిపోయీని    
                   నిలు వెంత,   నీటెంత , నీమాయలివి  భువి , బలము  తెలియు వాడే  “ పరతత్వవేది “

ఒక  తిత్తి లోనుండి , పుట్టేటి  జీవము యొక్క  మనస్సు ( తలపు ), బ్రహ్మాణ్డాలన్నీ  వ్యాపించివున్న 
ఆ  మనస్సు ఒక్కటే .  అదే విశ్వాత్మ, అదే పరమాత్మ. అదే సర్వాంతర్యామియైన “విష్ణుమానసము.” 
కొలతలకు అందని  విస్తీర్ణమైన  ఈ విష్ణు మాయను  తెలిసినవాడే  “ పరతత్వవేది “. 
విష్ణు మనోబలము “  నెరిగినవాడే , అసలు సిసలైన “ పరతత్వవేది “.  (4, సంకీర్తన 363)


మరి , ఈ  విష్ణు శక్తి, “విష్ణు మాయ” , “విష్ణు మనసు” , “విష్ణుఆత్మ” , “విష్ణు కాంతి” , ““విష్ణు వ్యాప్తి “ తెలిసిదేలా?.???? ఒకే ఒక్కమాటలో,  పరతత్వము  బోధపడేదెలాగా?.?.?

        హరి హరి ఇందరికి  అబ్బురముగాని , ఇది పరగ ,  నీ దాసుడే  “ పర తత్వవేది “. 

చెప్తే కొంచం ఆశ్చర్యమనిపించొచ్చుగానీ , చూస్తే అతి సాధారణమైన సూత్రం ,  “ హరి భక్తుడౌటే “

    హరిదాసుడౌటే   “ పరతత్వవేది “ ఔట .     అంతా “వైష్ణవమే”.      అంతా  “విష్ణు తత్వమే “. 

                  అన్నమయ్య  మాట 






18, జులై 2018, బుధవారం

వృధా

 అన్నమయ్య   ఎలాగంటున్నాడో చూడండి !   ఈ  భూమిపై ,  అన్నీ  వృధా, వ్యర్థం. ఈ క్రింది  పాటలో, ఏది. ఈ ప్రపంచంలో   ఉపయోగపడే విషయం ?  ఏది ఉపయోగ పడదో  వివరించారు.     

           “ వెఱపులు  వొరపులు  వృధా  వృధా , ధరపై  మరి అంతయును వృధా “ (1, సంకీర్తన 217)

  అన్ని బంధాలూ  వృధానే. ఎందుకంటే,  పోయేటప్పుడు అవన్నీ విడచి పోవాలిగా!!!
ఎవ్వరూ  నీతో  వెంట రారు గదా!!! మరి, ఈ బంధుత్వాలకోసం  ఎన్నో  చెడ్డ  పనులు చేసి,  ఎంతో పాపాన్ని 
కూడకట్టుకొని,  నాది నాది అంటూ ఎన్నో  కస్టాలు భరించితే,  చిట్టా చివరికి  నీతో  ఎవ్వరైనా వస్తున్నారా? ??
ఒక్కడివే వస్తావు.  ఒంటరిగా పోతావు.  అందుకని , ప్రాపంచికత  వ్యర్థం, అంటారు అన్నమయ్య. 
                         
             “  తడయక  చేసిన  దానంబులు వృధా,  ఎడయక  ఎరిగిన  ఎరుక వృధా 
                 ఒడలిలోని  హరినొనరగ  మతిలో ,  తడవని జీవమే  తనకు  వృధా “
మనలోనున్న  దైవాన్ని , మనస్సులో తలచుకోని  జీవితం, ఎన్ని దానాలు చేసినా  వ్యర్ధమే. 

                “ జగమున బడసిన  సంతానము వృధా, తగిలి గడించిన  ధనము  వృధా 
                    జగదేక విభుని  సకలాత్ముని  హరి , తెగి కొలువని  బుద్ధియును  వృధా “
అన్నిజీవులలోనున్న   సర్వాంతర్యామియైన  హరిని  మెచ్చి పూజించక,  పడీపడీ సంపాదించిన  సంపదలు, 
సంతానమూ  వ్యర్ధమే.   

                      “ పనివడి  కూడిన  పరిణామము వృధా , వొనరగ వుండిన  ఉనికి  వృధా 
                            ఘనుడగు  తిరువేంకటగిరి  హరిగని ,  మననేరని  జన్మములు  వృధా “
శ్రీ వెంకటా ద్రి  మీద  నెలకొన్న  గొప్పవాడైన వేంకటేశ్వరుని  హరిని,  ఆ వేంకటేశ్వరుని మనసార  పూజించక, 
చేసిన అనేకమైన  పనులు , వాటి  ఫలములు , ఉండే  వునికే  వ్యర్ధము,  అన్నారు అన్నమయ్య. 

సారాంశమేమిటంటే , అంటే,  ఈ  జన్మమెత్తినందుకు , సాఫల్యము  శ్రీ హరి స్మరణమే. 
మిగిలిన  పనులేవైనా చేయక తప్పదు గనుకే చేయాలి.  అవీ  ధర్మబద్ధమైన  పనులే చేయాలి. 
సంపదలూ,  సంతానములూ,  సంబంధాలూ ,  బాంధవ్యాలూ, పదవులూ, పేర్లూ ...... అన్నీయూ , 
శ్రీ వేంకటేశ్వరుని పూజించినపుడే,  సార్ధకమౌతాయి గానీ, లేకుంటే , వృధా అయి  ఫలించవు. 
దైవాన్ని మరువకుండా  , మంచి బుద్ధితో   జీవితాన్ని  గడపమని  అన్నమయ్య వేదాంతం. 

                     అన్నమయ్య మాట 







11, జులై 2018, బుధవారం

రహస్యం రహస్యం

  శ్రీ వేంకటేశ్వరుని  దయ  పొందడానికి  కీలకం ఏంటి?  ఎక్కడుంది ?  చెప్తున్నారు  అన్నమయ్య  భక్త శిఖామణి.  అనుభవంతో చెప్పిన  కీలకం  అది.  చాలా చిన్నవయసు లోనే  విష్ణు సాక్షాత్కారం  కల్గిన  దైవాంశ  సంభూతుడు  అన్నమయ్య. ఈ సంకీర్తనలో  చాలా చక్కగా, , దైవం ఎప్పుడూ  తోడుండే  మార్గం,  ఆ కీలకరహస్యం , చెప్తున్నారు.   

      “  వేసారి తేనే లేదు,  విచారించితే  కద్దు , మూసినదిదే కీలు , ముంచి వివేకులకు “. ( 3, సంకీర్తన 528)

ఎంత చర్చలు చేసితేనేమి  ప్రయోజనం .?? ఎంత  శ్రమించి  ప్రయాసపడితేనూ  ఏమి ప్రయోజనం??
దైవ కృపకు  ఒక్కటే  కీలకం,  “రహస్య కీలకం “, ఏలాంటి  జ్ఞానులకైనా , అంటూ, ఆ కీలకం ఏమిటో  క్రింది  పాటలో  చెప్తున్నారు అన్నమయ్య . 

                        “మనసులోన  ఇందిరేసు తలచిన , అవ్వల బాయకుండు  నదియే  “వైకుంఠం “. 
                         దవ్వులకునేగవద్దు  జపము తపము వద్దు, ఇవ్వల  నిదే  “కీలు “  ఎరిగినవారికి “

అక్కడకి  ఇక్కడకి  తిరగనక్కరలేదు. జపము  తపము అవసరమేలేదు. మనస్సులో  “ నారాయణుని “
తలచుకొంటూ  ఉంటే  చాలు, తోడు వదలకుండా, నీతోనే ఉంటాడు.  నీమనసే  “ వైకుంఠం “ అవుతుంది. 
అంటే , “నారాయణ స్మరణే “  దైవ కృపకు  రహస్య కీలకం  అన్నమాట.   

              “ నాలుకనెవ్వరైనా  నారాయణు  పొగడిన , చాలి అతడాడవుండు , జగములూ వుండు 
              కాలమూ  నడుగవద్దు ,  కర్మమూ నడుగవద్దు , పోలింపనిదే “ కీలు “ పుణ్యమానవులకు “

  
  “నారాయణ ” అని అంటే చాలు , నీ ప్రక్కనే  ఉంటాడట. . సకల జగములూ  నీతో ఉంటాయట.    
ఇక , కాలంని  కర్మాన్ని  నిందించడమెందుకు??.. పుణ్యులైన వారందరూ  ఎప్పుడూ  నారాయణా  నారాయణా  అని , పిలుస్తూనే  వుంటారు.  చేసే ప్రతిపనీ, నారాయణా అంటూనే  చేస్తారు. ఒక్క   నిమిషముకూడా  నారాయణుని మరువరు.  అదే , ఆ  “ నారాయణ  స్మరణే “ దైవ కృపకు 
“ రహస్య కీలకం “. 
                      
                  “శ్రీ వెంకటేశు  చేరి  ఎవ్వరు నమ్మినా , కైవశమై  అతడింట కాచుకుండును 
                      సావధానములు వద్దు,  శరణంటేనే చాలు , భావింపనిదే  “కీలు “ పరమయోగులకు “

కులము  జాతి  పేద ధనిక  భేధమేలేదు.  ఎవ్వరు నమ్మినా , ఎవ్వరు నారాయణా అని పిలిచినా,  చేపట్టి , 
అతనింట  కాచుకొనివుంటాడట. ఇక్కడ ,” పట్టు “ ఏమిటంటే , మనస్ఫూర్తిగా, నమ్మాలి.  నీవే నా సర్వస్వము నారాయణా  , అని  “మనసా వాచా కర్మణా “ లొంగిపోవాలి.     అప్పుడు చూడాలి. !!! 
హాఁ  ! ప్రక్కతోడై నిలుచుంటాడు,  జీవితాన్ని తానే నడిపించుతాడు. ఇంత  సులభమైన మార్గం  ఉండగా, 
ఇంకా ఏదేదో  , ఏవేవో,  ఏమేమో చేసి వేసారడమెందుకు? సంపూర్ణ  విశ్వాసముతో  “ నారాయణస్మరణం““ దైవ కృపకు  “కీలకం. “                   “వెల సులభము. ఫలమధికము “. 

                        అన్నమయ్య మాట 

4, జులై 2018, బుధవారం

వైరాగ్యమంటే ఏంటి????

   మనస్సుని  ఎలాగ  నిగ్రహించాలి ? అని , అర్జునుడు  శ్రీ కృష్ణుని  అడిగితే,  ఈ సమాధాన మిచ్చ్చాడు  కృష్ణ పరమాత్మ .  “”అభ్యాసేనతు  ,  వైరాజ్ఞేన “ కౌన్తేయ. ( భక్తి యోగం , అధ్యాయం 6)



వైరాగ్యాన్ని సాధన చేసి,  మనస్సును  మలినారహితంగా  తయారు చేసుకోవాలి.


ఒకటా భక్తితో ,  లేదా  వైరాగ్యం తో  ,  మనస్సును ఇంద్రియాల  మోహమాయ నుండి ,  తప్పించాలి , అని  కృష్ణుని  బోధ.  వైరాగ్యమంటే  ఏంటి? ?? వైరాగ్యం ఎందుకు?? అని  అన్నమయ్య , చక్కగా  వివరించారు, క్రింది పాటలో.......

      “    తెగక  పరమునకు  తెరువు లేదు ,  వగయెల్లా  విడువక  భవమూ బోదు “( 203, సంపుటం 1)

సంసార వ్యామోహాలనుండి,  సంసార బంధాలనుండి ,  సంబంధం  తెంచుకోనన్నినాళ్ళు  వైరాగ్యం రాదు.
                       
                                     
              చిత్తములోపల పలు   చింతలు  మానినదాకా.
                సత్తుగా  “ వైరాగ్యము “. సమకూడదు.
                     ఇత్తల  శ్రీ వెంకటేశు డేలిన   దాసులకైతే      
                            హత్త్తి  వైకుంఠ  పదవి  అప్పుడే కలదు.  ( 3, పాట 203 )

మనస్సులో  రకరకాల ఆలోచనలు  మెదలుతున్నప్పుడు, మనశ్శాంతి  ఎక్కడిది. ?.? మనస్సుని  అనవసరపు  ఆలోచనలనుండి  తప్పించి,  కట్టి పెట్టినప్పుడే ,  విషయాలనుండి  విరక్తి  రాగలదు.   అన్నమయ్య “ విరతి “ అంటాడు విరక్తిని.  విషయవిరక్తే  వైరాగ్యం. అదే స్వచ్ఛమైన  మనస్సు.  అదే  వేంకటేశుని  దయకు  దోవ.  ఏఏ  విషయాలను వదిలేయాలి ,  వైరాగి కాడానికి ? అనేది  ఈ క్రింది
చరణాలలో చెప్పాడు.

“కన్నులయెదుటనున్న  కాంచనముపై  మమత ఉన్నంత  తడవు,  మోక్షమొనకూడదు
అన్నముతోడి రుచుల  అలమట  గలదాకా ,  పన్నిన  సుజ్ఞానము  పదిలము  కాదు. “

                           “  ప్రక్కనున్న  కాంతల భ్రమగల  కాలము.
                                 మిక్కిలి శ్రీ హరి భక్తి   మెరయలేదు
                                    వెక్కసపు సంసార విధి నున్నంత తడవు.
                                        నిక్కి  పరమ ధర్మము  నిలకడ  గాదు “.

వైరాగ్యం  రావాలంటే,   వేటి వేటి  నుండి  మనస్సును నిగ్రహించాలి??
బంగారు పై వ్యామోహం,  అతి రుచికరమైన తిండి పదార్ధాలపై  మోహం ,  స్త్రీ లోలత్వం,  ఎక్కసమైన  సంసార తాపత్రయం వున్నంతకాలం  చిత్తం ,శాంతస్థితిని  పొందదు.  శాంతములేకుండా , సుజ్ఞానాన్ని  పొందగలిగే  స్థిరబుద్ధి  రాదు. రాదంటే  రాదు.      
సుజ్ఞానమే గదా, వైరాగ్యాన్ని  పెంపొందించేది!,  శ్రీ వెంకటేశు  వైపు  ధ్యాసను మరల్చేది.

ఒక్కమాటలో, “ వైరాగ్యం “ అంటే  అన్నింటినీ మానసికంగా  వదలడం .
ప్రపంచంలో ఉంటూనే,  బంధించుకోకుండా ,  నిమిత్తంగా జీవించడం.  అల్లా జీవించేవారికి,   పాపపుణ్యాలు అంటావు,  తామరాకుపై నీటి  బొట్టులాగ.
వైరాగ్యమే మోక్షానికి మార్గం.

                                           అన్నమయ్య మాట



3, జులై 2018, మంగళవారం

యోగి ఎవ్వరు ??.??

   యోగి ఎవ్వరు?  అసలైన  యోగి  ఎవ్వరు?  నిజమైన యోగికి ఉండే  లక్షణాలేమిటి???
యోగి అవ్వడానికి ఏ ఏ అర్హతలుండాలి?    యోగి కాడానికి , యే  మార్గం  ఉత్తమం? అన్నీ  పాయింట్లు ఒకే
సంకీర్తనలో  విశదీకరించారు అన్నమయ్య,  ఏంత్తో  ముద్దుగా.

              “ వాసి , వంతు  విడచినవాడే  యోగి, ఈ  ఆశలెల్ల విడచిన. అతడే యోగి
నాది ఇది,  నావంతు ఇది, అనే  ఆశాపాశాలు వదిలేసినవాడు ,  అసలైన “ యోగి “.

                “ గద్దించిపారెడు  తురగము వంటి  మనసు , వద్దని మరలించేవాడే  యోగి
                      వద్దని కొండలవంటి  ఉన్నత దేహగుణాలు , దిద్ది మట్టుపెట్టే వాడే “ ధీరుడైన యోగి

పరుగెత్తే  గుర్రంలాంటి మనస్సుకు  , పగ్గంవేసి ,  తన స్వాధీనంలోకి  తీసుకోగలిగినవాడే  “ యోగి “.    


 రజస్తమో గుణాల సంకెళ్లనుండి  శరీరాన్ని  శాసించి,  సత్వ గుణం వైపు మరలించే   వాడే  నిజమైన.
“ ధైర్యవంతుడైన యోగి “.
వైరాగ్యామంటే ఏమిటి?
                         “ ముంచుకొన్న ఇంద్రియపు మోహజలనిధిలోన , వంచన  మునగనట్టివాడే “  యోగి
                     పొంచి పుణ్యపాపములు  పొట్టువంటి కర్మములు , దంచి  పారజల్లువాడే తత్వమైనయోగి” “

పంచేంద్రియాలు ( చర్మం, చెవి, నాలుక, ముక్కు, కళ్ళు)  మనలో,   ప్రాపంచిక  విషయాలపై  మొహాన్ని        పుట్టిస్తాయి.  అలాంటి  మోహసముద్రములో  మునిగిపోకుండా, యే వంచనకూ  లోబడని వాడే  “ యోగి.                ”.
పొట్టు  లాంటి పాపపుణ్యములను,  కర్మబంధములను , దంచేసి,  ఆ పొట్టును  ఊదిపారేసే  వాడే,   యోగి      


పర తత్వ యోగి “ , పరతత్వం తెలిసిన యోగి.

                             “ వెగటు  కామాధుల  వెళ్లగొట్టి  శాంతుడై , వగలుడిగినయట్టి వాడే   “యోగి ”.
                            నిగిడి శ్రీ వేంకటపతి  నిజదాసుడై,  భక్తి తగిలి  నిలుపువాడె ధన్యుడైన  యోగి. “.   

అసభ్యమైన  “ కామ క్రోధ లోభ మోహ మాడ మాత్సర్యములను ”  తరిమిగొట్టి,  పారద్రోలి,  ఎలాంటి  షోకులులేని శాంతస్వభావుడైన వాడే,  అసలైన  “ యోగి. “ శ్రీ వేంకటేశ్వరుని “భక్తి “ తగిలినప్పుడేగాని,
ఎవ్వరైనా ఈ , పైన అన్న  ఆరు శత్రు గుణాలనుండి, మనిషి బయటపడలేదు.  భక్తి  అనే తెడ్డుతో, ఈ
ప్రపంచ  బంధాల ప్రవాహాసాన్ని దాటి, ఒడ్డు  చేరగలమంటున్నాడు , శ్రీ  అన్నమయ్య.

“ యోగి “అంటే ,  మూక్కు మూసుకొనికూర్చొనే వాడు కాదు.  ఆసనాలు, ప్రాణాయామం చేసేవాడు కాదు.
ఆ అభ్యాసాలన్నీ,  శరీరాన్ని  సిద్ధంచేసి ,  యోగిని చేసేందుకు  తయారీలు, ప్రయాసలు.  దైవానితో,  అంటే     ఆ “విశ్వమనస్సు “ తో , మనిషిని, “ అనుసంధానం “ చేయడమే “యోగం “ అంటే.

 “ యుజ్జన్నేవం సదాత్మానం, యోగి విగత కల్మషాహ “ అని , “యోగి “ అనే శబ్దాన్ని  నిర్వచించింది. గీత

ఒక జీవాత్మ,  పరమాత్మ తో  అనుసంధానం అవ్వాలంటే,  మొదలు యోగిగా మారి, తర్వాత  ఆ విష్ణు భకుడవ్వాలీ.    భక్తి ఒక “డిటర్జెంట్. “   , మనస్సును శుబ్రపరిచే “మందు “ .

భక్తి,   మనిషిలోని  మలినాన్ని కడిగి, శుద్ధాత్మ.గల ”  యోగి “  గా   
   తయారుచేస్తుంది.  ఇదే  అన్నమయ్య     మాట.

      అన్నమయ్య మాట.        


  
    
 

  
  

      



  





    



   







         
 


1, జులై 2018, ఆదివారం

మాయ

    అన్నింటిలో నున్న  ఆ  పరమాత్ముడు  అగుపడడేమి???? ఇది అనాదిగా ,  అందరిని  వేదిస్తున్న  ప్రశ్న.
అలాగే  మనస్సు ,  బుద్ధి, జ్ఞానం,  చైతన్యం, లాంటి  అనుభవానికి మాత్రమే అందే విషయాలు ,  కంటికి
ఏం  కనిపించవు. .???? దైవీక మైన  ఏ  విషయమైనా  కంటికి కానాననిదే.  “వుంటుంది. ”అంతే.
దానికి కారణం ?????   “మాయ “.   అన్నమయ్య ఈ  మాయను గూర్చి, మాయ అంటే ఏమిటో,  చాలా పాటలలో, చెప్పారు. అన్నమయ్యకు మాయ అంటే తెలుసు,  మాయలో దాగిన దైవమ్మూ  తెలుసు.

 “ దేవా  నీ   మాయా  తిమిర మెట్టిదో , భారము జూచి  గొబ్బున కావవే “ ( 1, సంకీర్తన 382)
“మాయ “ అనే  చీకటి , మన అందరినీ ఆవహించివున్నది. ఈ మాయ ఎలాగుంటుంది?

“. పొలసి  “ మశ కము “ నందు పోడమేటి జీవుని “
నీవెంత  నేటెంత  నీ మాయలివి  భువి  
                           (4, 363 సంకీర్తనం)
“ మసకము “ అంటే, ఒక  తిత్తి  లేక ఒక  సంచీ లాంటిది.  సత్వ, రజస్తమో గుణాలు మూడింటితో,  తయారైన , ఈ మాయ అన్నీ జీవులను కప్పిఉంటుంది. దీనినే  “ మోహమాయ “ అని కూడా అంటారు .
పంచభూత వికారాలు మోహమాయ వల్ల  కలిగినవే.
మాయ  వల్లే మనకీ  సంసారబంధాలు.  సంసార బంధాలవల్ల  సుఖదుఃఖాలు. దీనినే  కోరికల పై  మొహం
అంటాము. మాయని  అధిగమించడమే,  వైరాగ్యం.       వైరాగ్యమే  బంధవిముక్తికి  మార్గం. అంటారు   అన్నమయ్య  ఈక్రింది సంకీర్తనలలో   .........

      “ మాయకిదె  సహజము , మాయను గెలువరాదు.
                    మాయానాధు  గొలిచితే  మన్నించునాతడే   “

 మాయను  కల్పించిన  ఆ దైవాన్నీ కొలుచుటే ,  దాన్ని  గెలిచే మార్గము,  అని అర్ధము.
ఈ “ మాయ “  సృష్టి జరిగిననాటినుండీ  లోకాలను,  జీవులను ఆవరించియున్నది.
మాయయే  “ కామ క్రోధ మోహ లోభ మద  మాత్సర్యాలనే “  ఆరు గుణ శత్రువులకు  మూలం.
ఈ  ఆరుగుణాలు  మనిషి  జీవితాన్ని ఆడిస్తాయి.  అందుకని,  మొహం పెంచే , ఈ మాయ నుండి , విముక్తి పొందమని , ఆ వేంకటేశుని  స్మరించడమే  దానికి  సాధనమని,   అన్నమయ్య  సూటిగా చెప్పారు.

“అనాది జగములు  అనాది దేవుడు వినోదములుగాని విసుగదు మాయా
పుట్టేటి జీవులు,  పోయిన జీవులు, వొట్టిన జీవులు వున్నారు. “

ఏ  “పరంజ్యోతి “ విశ్వాఅంతరాళా లలో వెలుగు నింపుతోందో ,  దాన్ని    కానరాకుండా   కప్పివుంచుతోంది “ “మాయ “.   ఆఁ  మాయ అనే  పొర  తొలగితే , దైవము సాక్షాత్కరించడమే తరువాయ్.

“త్రిభిర్గుణమయై ర్భావైరభి  స్సర్వమిదంజగత్ మోహితం నాభిజానాతి  మామేభ్యహ్ పరమవ్యయం “ గీతలో ని ,. జ్ఞాన విజ్ఞానయోగంలో ,  చెప్పబడినది.  అదే అన్నమయ్య పాట  కూడా చేప్తోంది .

                అన్నమయ్య మాట


గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...